IPL 2023, CSK vs DC: చెపాక్‌లో చెల‌రేగిన ధోని సేన‌.. ఢిల్లీపై ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings) ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023, CSK vs DC: చెపాక్‌లో చెల‌రేగిన ధోని సేన‌.. ఢిల్లీపై ఘ‌న విజ‌యం

CSK Win (PIC IPL Twitter)

Updated On : May 10, 2023 / 11:22 PM IST

IPL 2023, CSK vs DC: ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings) ఘ‌న విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 140 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో చెన్నై 27 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో రిలీ రోసో(35), మ‌నీష్ పాండే(27), అక్ష‌ర్ ప‌టేల్‌(21) ప‌ర్వాలేద‌నిపించ‌గా డేవిడ్ వార్న‌ర్‌(0), మిచెల్ మార్ష్(5), సాల్ట్‌(17)లు విఫ‌లం అయ్యారు. చెన్నై బౌల‌ర్ల‌లో మతీషా పతిరణ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా దీప‌క్ చాహ‌ర్ రెండు, ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ తీశాడు.

IPL 2023, CSK vs DC: ఢిల్లీ పై చెన్నై ఘ‌న విజ‌యం
అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో రుతురాత్‌(24), ర‌హానే(21), దూబే (25), రాయుడు(23), జ‌డేజా(21)లకు మంచి ఆరంభాలు ల‌భించినా భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. ఆఖ‌ర్లో ధోని(20; 9 బంతుల్లో 1ఫోర్‌, 2 సిక్స్‌లు) త‌న‌దైన శైలిలో ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్ రెండు, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, ల‌లిత్ యాద‌వ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023, CSK vs DC: చెపాక్‌లో స‌త్తా చాటేది ఎవ‌రో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే