IPL 2023, CSK vs DC: చెపాక్‌లో స‌త్తా చాటేది ఎవ‌రో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి చెన్నైలోని చెపాక్ వేదిక కానుంది. నేడు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) త‌ల‌ప‌డ‌నుంది.

IPL 2023, CSK vs DC: చెపాక్‌లో స‌త్తా చాటేది ఎవ‌రో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే

CSK vs DC

IPL 2023, CSK vs DC: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి చెన్నైలోని చెపాక్ వేదిక కానుంది. నేడు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) త‌ల‌ప‌డ‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో చెన్నై రెండో స్థానంలో ఉండ‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ అట్ట‌డుగున ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ కు మ‌రింత చేరువ‌ కావాల‌ని చెన్నై బావిస్తుంది. అటు ఢిల్లీకి ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు 27 సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 17 సార్లు చెన్నై గెలుపొంద‌గా, 10 సార్లు ఢిల్లీ విజ‌యం సాధించింది. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు తొలిసారి త‌ల‌ప‌డనున్నాయి. సొంత మైదానంలో ఆడుతుండ‌డం చెన్నైకి క‌లిసివ‌చ్చే అంశం.

IPL 2023: ముంబై జట్టు నుంచి జోఫ్రా ఆర్చర్ ఔట్.. టీంలోకి కొత్త ప్లేయర్ ..

తుది జ‌ట్టులోకి బెన్‌స్టోక్స్..!

ఈ సీజ‌న్ ఆరంభంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్‌పై భారీ అంచ‌నాలు ఉండేవి. అయితే.. తొలి రెండు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన అత‌డు గాయంతో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. పూర్తిగా కోలుకోవ‌డంతో ఢిల్లీతో మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ ఆడే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మొయిన్ అలీ స్థానంలో అత‌డిని తుది జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ  ఒక్క‌టి మిన‌హా చెన్నై జ‌ట్టులో ఎటువంటి మార్పులు ఉండే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఓపెన‌ర్లు రుతురాజ్‌, కాన్వే ల‌తో పాటు ర‌హానే, దూబే, ధోని ఫామ్‌లో ఉండ‌డం చెన్నైకి క‌లిసి వ‌చ్చే అంశం. ఇటీవ‌ల దూకుడుగా ఆడుతున్న‌ ర‌హానే గ‌తంలో ఢిల్లీ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో ఇబ్బందులు ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా ఉండే అవ‌కాశం ఉంది.

స్పిన్‌లో ఆడితేనే..

ఢిల్లీ జ‌ట్టు మంచి ఫామ్‌లో ఉంది. అయితే.. మిచెల్ మార్ష్‌, రైలీ రూసో, ఫిల్ సాల్ట్ లు ముగ్గురు స్పిన్ ఆడ‌డంలో కాస్త త‌డ‌బ‌డుతారు. ఈ బ‌ల‌హీన‌త‌ను చెన్నై జ‌ట్టు క్యాష్ చేసుకునే అవ‌కాశం ఉంది. జ‌డేజా, తీక్ష‌ణ రూపంలో ఇద్ద‌రు నాణ్య‌మైన స్పిన్న‌ర్లు చెన్నై సొంతం. దీంతో వీరు స్పిన్ బౌలింగ్‌లో ఎలా ఆడుతారు అన్న‌ది కీల‌కంగా మారింది. ఇటు ఢిల్లీ బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాద‌వ్ కీల‌కం కానున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్ మ‌రోసారి రాణించాల‌ని ఢిల్లీ జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది.

IPL 2023, CSK vs MI:ముంబై పై ధోని సేన ఘ‌న విజ‌యం.. రెండో స్థానానికి చేరిన చెన్నై

పిచ్‌..

చెన్నై, ముంబై మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో బౌల‌ర్ల హ‌వా కొన‌సాగింది. అయితే.. చాలా రోజులు త‌రువాత సాయంత్రం మ్యాచ్ జ‌రుగుతుండ‌డంతో బ్యాట‌ర్లు పండ‌గ చేసుకోవ‌చ్చు. టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

తుది జ‌ట్ల ( అంచ‌నా)

చెన్నై సూప‌ర్ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ/ బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, అంబటి రాయుడు

ఢిల్లీ క్యాపిట‌ల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్

Rohit Sharma: రోహిత్.. నీ పేరును ‘నో హిట్ శ‌ర్మ’ గా మార్చుకో.. కృష్ణమాచారి శ్రీకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు