IPL 2023, CSK vs MI:ముంబై పై ధోని సేన ఘ‌న విజ‌యం.. రెండో స్థానానికి చేరిన చెన్నై

ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) ఘ‌న విజ‌యం సాధించింది

IPL 2023, CSK vs MI:ముంబై పై ధోని సేన ఘ‌న విజ‌యం.. రెండో స్థానానికి చేరిన చెన్నై

CSK Win ( PIC IPL Twitter)

IPL 2023, CSK vs MI: ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) ఘ‌న విజ‌యం సాధించింది. 140 ప‌రుగు ల‌క్ష్యాన్ని 17.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో చెన్నై జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది.

ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నైకు డెవాన్ కాన్వే(44; 42 బంతుల్లో 4 పోర్లు), రుతురాజ్ గైక్వాడ్‌(30; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు శుభారంభాన్ని అందించారు. కాన్వే నిదానంగా ఆడ‌గా రుతురాజ్ గైక్వాడ్ దూకుడుగా ఆడాడు. తొలి వికెట్‌ను 47 ప‌రుగులు జోడించిన అనంత‌రం రుతురురాజ్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అజింక్యా ర‌హానే(21), అంబ‌టి రాయుడు(12) తో క‌లిసి కాన్వే వ‌రుస‌గా 35, 24 ప‌రుగుల భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు.

IPL 2023, CSK vs MI:ముంబై పై చెన్నై ఘ‌న విజ‌యం

వీరిద్ద‌రు వెనుదిరిగిన‌ప్ప‌టికి శివ‌మ్ దూబే(26 నాటౌట్; 18 బంతుల్లో 3 సిక్స‌ర్లు)తో క‌లిసి కాన్వే చెన్నైని గెలుపు వాకిట్లోకి తీసుకువ‌చ్చాడు. విజ‌యానికి 10 ప‌రుగులు అవ‌స‌రమైన ద‌శలో ఔట్ అయ్యాడు. మిగిలిన లాంఛ‌నాన్ని దూబే, ధోని(2 నాటౌట్‌) పూర్తి చేశాడు. ముంబై బౌల‌ర్ల‌లో పీయూష్ చావ్లా రెండు, ట్రిస్టన్ స్టబ్స్, ఆకాష్ మధ్వల్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో నెహ‌ల్ వ‌ధేరా(64; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా సూర్య‌కుమార్ యాద‌వ్‌(26; 22 బంతుల్లో 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్(20; 20 బంతుల్లో 2 ఫోర్లు) ప‌ర్వాలేద‌నిపించారు.

IPL 2023, SRH Vs KKR: స‌న్‌రైజ‌ర్స్ కోచ్ బ్రియాన్ లారా కీల‌క‌ వ్యాఖ్య‌లు.. ‘కోల్‌క‌తా ఓడించ‌లేదు.. మేమే ఓడిపోయాం’

ఓపెన‌ర్లు కామెరూన్ గ్రీన్‌(6), ఇషాన్ కిష‌న్‌(7)ల‌తో పాటు వ‌న్ డౌన్ బ్యాట‌ర్‌ రోహిత్ శ‌ర్మ‌(0)లు విఫ‌లం కావ‌డంతో 14 ప‌రుగుల‌కే ముంబై మూడు వికెట్లు కోల్పోయి ముంబై క‌ష్టాల్లో ప‌డింది. నేహ‌ల్ వ‌ధేరా, సూర్య‌కుమార్ లు ఇద్ద‌రు ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. స్ట‌బ్స్ ప‌ర్వాలేద‌నిపించ‌గా ఆఖ‌ర్లో ధాటిగా ఆడుతాడు అనుకున్న టిమ్ డేవిడ్‌(2) సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమితం అయ్యాడు. చెన్నై బౌల‌ర్ల‌లో మతీషా పతిరణ మూడు వికెట్లు తీయ‌గా, దీప‌క్ చాహ‌ర్‌, తుషార్ దేశ్‌పాండేలు చెరో రెండు వికెట్లు, ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.