obstructing the field : ‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ అంటే ఏమిటి..? క్రికెట్‌లో ఇలా ఔటైన టీమ్ఇండియా ఆట‌గాడు ఎవ‌రంటే..?

బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు అయిన‌ ముష్ఫీకర్‌ రహీం పేరు ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో మారుమాగిపోతుంది. అత‌డు ఏదో మెరుపు సెంచ‌రీనో మ‌రేదో రికార్డు సాధించడంతో వార్త‌ల‌ల్లో నిలిచాడు అనుకుంటే మాత్రం మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే.

Mushfiqur Rahim-Mohinder Amarnath

బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు అయిన‌ ముష్ఫీకర్‌ రహీం పేరు ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో మారుమాగిపోతుంది. అత‌డు ఏదో మెరుపు సెంచ‌రీనో మ‌రేదో రికార్డు సాధించడంతో వార్త‌ల‌ల్లో నిలిచాడు అనుకుంటే మాత్రం మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. ఢాకా వేదిక‌గా న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో అత‌డు ఔటైన విధాన‌మే వార్త‌ల్లో నిల‌వ‌డానికి కార‌ణం.

సాధార‌ణంగా క్రికెట‌ర్లు క్యాచ్, బౌల్డ్‌, ర‌నౌట్‌, ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ కావ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉంటాం. అప్పుడ‌ప్పుడు హిట్‌వికెట్‌గా ఔటైన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే.. అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ గా ఔట్ కావ‌డం అనేది అత్యంత అరుగా జ‌రుగుతంది. కివీస్ తో మ్యాచ్‌లో ర‌హీం ఇలాగే ఔట్ అయ్యాడు.

Obstructing The Field : విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు.. చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ అంటే ఏమిటి..?

క్రికెట్ చ‌ట్టాల‌ను రూపొందించే ఎంసీసీ చ‌ట్టాల్లో అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ అనే నిబంధ‌న ఉంది. 37.2 నిబంధ‌న ప్ర‌కారం ఓ బ్యాట‌ర్ ఉద్దేశ‌పూర్వంగా త‌న వికెట్ కాపాడుకోవ‌డానికి బంతిని చేతితో అడ్డుకున్న‌ట్ల‌యితే దాన్ని అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ గా కింద ప‌రిగ‌ణిస్తూ బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప్ర‌క‌టిస్తారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా 11 మంది ఆట‌గాళ్లు ఔట్ అయ్యారు. ఈ జాబితాలో ముష్ఫీకర్‌ రహీం 11వ ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇద్ద‌రే ఇలా పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. వీరిలో ర‌హీం రెండ‌వ ఆట‌గాడు కాగా.. 1951లో ఇంగ్లాండ్‌కు చెందిన లియోనార్డ్ హ‌ట‌న్ మొద‌టి ప్లేయ‌ర్‌.

టీమ్ ఇండియా ప్లేయ‌ర్ ఎవ‌రంటే..?

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క ఆట‌గాడు అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ కింద ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో మొహింద‌ర్ అమ‌ర్‌నాథ్ ఇలా ఔట్ అయ్యాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ గా ఔటైన ఆట‌గాళ్లు వీరే..
రస్సెల్ ఎండీన్, ఆండ్రూ హిల్డిచ్, మొహ్సిన్ ఖాన్, డెస్మండ్ హేన్స్, మొహిందర్ అమర్‌నాథ్, గ్రాహం గూచ్, డారిల్ కల్లినన్, స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, చము చిభాభా, ముష్ఫికర్ రహీమ్.

Bizarre way dismissal : టీ20 లీగ్​లో వింత ఘటన.. ఇంత‌టి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండరేమో..!

ట్రెండింగ్ వార్తలు