when will Abhimanyu Easwaran and Arshdeep Singh get a chance in Playing XI
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత్ సన్నద్ధం అవుతోంది. మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో టీమ్ఇండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగనుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనా కూడా ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్లను ఈ మ్యాచ్‌లోనైనా ఆడిస్తారా? లేదా? అన్నది చూడాల్సిందే.
Hardik Pandya-Jasmin Walia : జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా బ్రేకప్?
అభిమన్యు ఈశ్వరన్, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్‌లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికి కూడా ఇప్పటి వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం అవకాశం రాలేదు. వీరిలో అభిమన్యు ఈశ్వరన్, అర్ష్ దీప్ సింగ్‌లు ఇప్పటి వరకు టెస్టులు ఆడలేదు. అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నారు.
– ఈ పర్యటన ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేసిన సాయి సుదర్శన్ కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయ్యాడు. తొలి టెస్టులో అతడికి చోటు దక్కగా విఫలం కావడంతో అతడిని పక్కన పెట్టారు. మరోవైపు రీఎంట్రీలో ఘోరంగా విఫలం అవుతున్న కరుణ్ నాయర్ పై వేటు తప్పదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడిస్తారా? లేదంటే అభిమన్యు ఈశ్వరన్ ఆడిస్తారా? అన్నది చూడాల్సిందే.
– టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ లార్డ్స్‌లో కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు నాలుగో టెస్టులో ఆడతాడా? లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఆడకపోతే అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌కు ఆడే ఛాన్స్ ఉంది. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ కు నాలుగో మ్యాచ్‌లోనైనా అవకాశం వస్తుందో లేదో చూడాలి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి నిచ్చి అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు.
WCL 2025 : కమ్రాన్ అక్మల్ ఏం మారలేదు.. ఎనిమిదేళ్లు అయినా కూడా మిస్ చేస్తూనే..
– మాంచెస్టర్ పిచ్ ప్లాట్‌గా ఉండడంతో ఆఖరి మూడు రోజులు స్పిన్‌కు అనుకూలం అన్న వార్తలు వస్తున్నాయి. కాగా.. రెండు, మూడో టెస్టులలో జడేజాతో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లకు తుది జట్టులో చోటు దక్కింది. అయితే.. మాంచెస్టర్‌లో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అతడికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు.