When Will BCCI Announce Team India Squad For Champions Trophy 2025
ముచ్చటగా మూడో సారి ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకోవాలన్న టీమ్ఇండియా కోరిక నెరవేరలేదు. సిడ్నీ టెస్టులోనూ ఓడిపోవడంతో 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. పదేళ్ల తరువాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు ఆనందంలో మునిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిపోవడంతో ఇక ఇప్పుడు అందరి దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ పై పడింది. ఫిబ్రవరి 19 నుంచి హైబ్రిడ్ మోడ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాకిస్థాన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా, టీమ్ఇండియా ఆడే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు.
దాదాపుగా అన్ని జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే స్వ్కాడ్‌లను ప్రకటించాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రం ఇప్పటి వరకు జట్టును ప్రకటించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా టోర్నీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో బీసీసీఐ భారత జట్టును జనవరి 11న ప్రటించే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Steven Smith : పాపం స్టీవ్ స్మిత్ .. ఆస్ట్రేలియా గెలిచినా దక్కని ఊరట.. లంకలో అయినా..
తుది జట్టులో ఎవరు ఉంటారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. గతేడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 పపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమ్ఇండియా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు బాగా పెరిగిపోయాయి. ఇక ఈ ఇద్దరికి వన్డేల్లో ఛాంపియన్స్ ట్రోఫీ చివరిది అని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో వీరిద్దరు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాల్సిందే.
Gambhir: రోహిత్-కోహ్లీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఏమన్నాడంటే?
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఎనిమిది జట్లు పాల్గొనుండగా రెండు గ్రూపులు వాటిని విభజించారు. సెమీఫైనల్స్, ఫైనల్ కలిపి మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్ స్టేజీలో భారత జట్లు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 20 – భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
ఫిబ్రవరి 23 – భారత్ వర్సెస్ పాకిస్థాన్
మార్చి 2 – భారత్ వర్సెస్ న్యూజిలాండ్
భారత్ ఆడే మ్యాచులు అన్ని దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.