బుమ్రాను క్యూట్‌గా చూస్తూ మురిసిపోతున్న ఈ యంగ్‌లేడీ ఎవరో తెలుసా.. భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంలో ఆమె పాత్ర ఏంటంటే?

డగౌట్‌లో మ్యాచ్‌ను తిలకిస్తూ కూర్చున్న బుమ్రా వైపు క్యూట్ స్మైల్‌తో చూస్తున్న ఆ మహిళ పేరు యాస్మిన్ బడియాని.

Yasmin Badiani

ENG vs IND 2025: ఇంగ్లాండ్ వేదికగా.. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు జరుగుతుంది. భారత ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఈ మ్యాచ్‌ తుదిజట్టులో చేరలేదు. దీంతో బుమ్రా డగౌట్‌లో మ్యాచ్‌ను తిలకిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యంగ్‌లేడీ బుమ్రా వైపు క్యూట్‌గా చూస్తు మురిసిపోతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆమె ఎవరు.. భారత జట్టు సభ్యులతో ఎందుకుంది.. ఆమె నేపథ్యం ఏమిటి.. అనే విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Also Read: బుడ్డోడి బాదుడుకు వణికిపోయిన ఇంగ్లాండ్ బౌలర్లు.. సిక్సులు, ఫోర్లతో రఫ్పాడించిన వైభవ్ సూర్యవంశీ.. 12 ఏళ్ల రికార్డు బద్దలు.. వీడియో వైరల్

డగౌట్‌లో మ్యాచ్‌ను తిలకిస్తూ కూర్చున్న బుమ్రా వైపు క్యూట్ స్మైల్‌తో చూస్తున్న ఆ మహిళ పేరు యాస్మిన్ బడియాని. ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమె భారత జట్టు సభ్యులతో ఉండటానికి కారణం ఉంది. యాస్మిన్ బడియాని ఇంగ్లాండ్ అండ్ వేల్ఫ్ క్రికెట్ బోర్డు (ECB) టీమ్ ఆపరేషన్స్ యూనిట్‌లో పనిచేస్తున్న ఒక స్పోర్ట్స్ ప్రొఫెషనల్. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు సహాయం చేయడానికి ఈసీబీ అధికారికంగా ఆమెను నియమించింది.

ఆతిథ్య క్రికెట్ బోర్డు తమ బృందం నుంచి ఒక వ్యక్తిని తమ దేశానికి వచ్చిన జట్టుతో సమన్వయం చేయడానికి నియమించడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే యాస్మిన్ బడియానిని భారత జట్టుకు సహాయకారిగా నియమించారు. ఆమె భారత జట్టు బృందంతో ఉంటూ జట్టు ప్రయాణ ఏర్పాట్లు, మ్యాచ్ లాజిస్టిక్స్, ప్రాక్టీస్ షెడ్యూల్స్, స్టేడియం యాక్సెస్ వంటి విషయాలను సమన్వయం చేస్తుంది. ఆమె తన విధుల్లో భాగంగా జట్టుతో సన్నిహితంగా పనిచేస్తూ వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. దీంతో ఆమె భారత జట్టుతో తళుక్కున మెరుస్తుంది.

 

యాస్మిన్ బడియాని 2010లో లిసెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజియోథెరఫీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. హారోగేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టులో పనిచేశారు. 2010 నుంచి 2013 వరకు ఆమె లిసెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌కు స్పోర్ట్స్ ఫిజియోథెరఫిస్ట్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత ఫిజ్ లిమిటెడ్‌లో హెడ్ ఆఫ్ స్పోర్ట్‌గా, క్లినోవాలో ఓఆర్ఎస్ స్పోర్ట్ హెడ్‌గా పనిచేశారు. 2022లో ఈసీబీ ఆపరేషన్స్ టీమ్‌లో చేరారు. అప్పటి నుంచి జాతీయ, సందర్శించే జట్లకు సున్నితమైన కార్యకలాపాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన భారత జట్టుకు హోమ్ బోర్డుతో సజావుగా కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి టీమిండియా సపోర్ట్ స్టాఫ్ కిట్‌తో భారత డ్రెస్సింగ్ రూంలో ఆమె తరచూ కనిపిస్తున్నారు.