WI vs AUS 2nd Test Pat Cummins Outrageous One Handed Stunner
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. గ్రెనడా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కమిన్స్ అందుకున్న క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ చరిత్రలో అద్భుత క్యాచ్‌ల్లో ఇది ఒకటి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఇది జరిగింది. ఈ ఓవర్‌ను పాట్ కమిన్స్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని వెస్టిండీస్ ఆటగాడు కిస్ కార్టీ డిఫెన్సివ్ షాట్ ఆడాడు. అయితే.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కార్టీ ప్యాడ్‌లను తాకి లెగ్‌సైడ్ షార్ట్ స్క్వేర్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది.
బాల్ వేసిన కమిన్స్ అదే రన్నప్‌లో ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి తన కుడి చేతి వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో చక్కని క్యాచ్ అందుకున్నాడు. దీంతో కార్టీ స్టన్ కాగా.. ఆసీస్ ఆటగాళ్లు ఆనందంలో మునిగితేలారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
CUMMINS, YOU BEAUTY 🤯
Pat Cummins pulls off a diving, one-handed caught & bowled screamer to dismiss Keacy Carty 🔥#AUSvWI pic.twitter.com/0JxwJaz16t
— FanCode (@FanCode) July 4, 2025
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది. నాథన్ లైయాన్ (2), కామెరూన్ గ్రీన్ (6)లు క్రీజులో ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 45 పరుగుల ఆధిక్యంలో ఉంది.