Kane Williamson: కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు.. తొలి కివీస్ ఆటగాడు అతనే

ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో 9వేల పరుగులు పూర్తి చేసిన వారిలో 19మంది బ్యాటర్లు ఉన్నారు. అయితే, తక్కువ టెస్టుల్లో 9వేల పరుగుల మైలురాయిని చేరిన వారిలో ..

Kane Williamson

Kane Williamson Created History: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు లెజెండరీ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టెస్టు క్రికెట్ లో 9వేల పరుగులు పూర్తిచేసిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో ఈ మైలురాయిని సాధించాడు. ఇప్పటి వరకు 103 టెస్టు మ్యాచ్ లు 182 ఇన్నింగ్స్ లలో 9వేల పరుగులను విలియమ్సన్ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ 2007 – 2022 వరకు టెస్ట్ క్రికెట్ ఆడాడు. అతను 112 మ్యాచ్ లు 196 ఇన్నింగ్స్ లలో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించగలిగాడు. అదిలా ఉంటే.. విలియమ్సన్ 9వేల పరుగుల మైలురాయి చేరుకునే క్రమంలో 32 సెంచరీలు, 35 ఆఫ్ సెంచరీలు చేశాడు.

Also Read: AUS vs IND: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సీనియర్ పేసర్ ఔట్

ఇప్పటి వరకు ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో 9వేల పరుగులు పూర్తి చేసిన వారిలో 19మంది బ్యాటర్లు ఉన్నారు. అయితే, తక్కువ టెస్టుల్లో 9వేల పరుగుల మైలురాయిని చేరిన వారిలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 99 టెస్టుల్లో 9వేల పరుగులు పూర్తి చేశాడు. రెండో స్థానంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా (101 టెస్టు మ్యాచ్ లలో), మూడో స్థానంలో శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కర (103 టెస్టుల్లో), నాల్గో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు యూనిస్ ఖాన్ (103 టెస్టుల్లో), ఐదో స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ నిలిచాడు. తాజాగా.. 103 టెస్టుల్లో 9వేల పరుగులు పూర్తి చేశాడు