×
Ad

World boxing cup 2025 : తెలంగాణ బాక్సర్ నిఖత్ జ‌రీన్ ఖాతాలో మరో స్వర్ణం

వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో (World boxing cup 2025 ) తెలంగాణ అమ్మాయి నిఖ‌త్ జ‌రీన్ అద‌ర‌గొట్టింది.

World boxing cup 2025 Nikhat Zareen wins gold medal

World boxing cup 2025 : వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో తెలంగాణ అమ్మాయి నిఖ‌త్ జ‌రీన్ అద‌ర‌గొట్టింది. గురువారం జ‌రిగిన మ‌హిళ‌ల 51 కేజీల ఫైన‌ల్‌లో నిఖ‌త్ జ‌రీన్ చెనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్ పై 5-0 తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే నిఖత్ ప్ర‌త్య‌ర్థిపై ఎదురుదాడికి దిగింది. త‌న‌దైన శైలిలో ప‌దునైన పంచ్‌ల‌తో ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డింది. ఆఖ‌రి వ‌ర‌కు అదే జోరును కొన‌సాగించి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని ముద్దాడింది.

ఈ టోర్నీలో నిఖ‌త్ పాటు మిగిలిన బాక్స‌ర్లు అద‌ర‌గొట్టారు. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ టోర్న‌మెంట్‌లో (World boxing cup 2025 ) మొత్తం 9 స్వ‌ర్ణ ప‌త‌కాలు భార‌త్ ఖాతాలో చేరాయి. మ‌రో 6 ర‌జ‌తాలు, 5 కాంస్య ప‌త‌కాల‌తో భార‌త్ ఈ టోర్నీని ముగించింది.

Priyank Panchal : నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్‌.. మామూలు విధ్వంసం కాదు భ‌య్యా..

మొత్తం 9 స్వర్ణాల్లో 7 స్వర్ణాలు మహిళల విభాగంలోనే రావడం దేశంలో బాక్సింగ్ క్రీడకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు తెలియ‌జేస్తుంది. నిఖ‌త్ జ‌రీన్‌తో పాటు మీనాక్షి, ప్రీతి, అరుంధతి చౌదరి, నూపుర్, జాస్మిన్ లాంబోరియా, పర్వీన్ లు స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను సాధించారు.

* 48 కేజీల విభాగంలో ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఫోజిలివా పై మీనాక్షి 5-0 తేడాతో విజ‌యం సాధించింది.
* 54 కేజీల విభాగంలో ఇట‌లీకి చెందిన సిరీన్ చర్రాబీని ప్రీతి 5-0 తేడాతో ఓడించింది.
* 57 కేజీల విభాగంలో పారిస్‌ కాంస్య పతక విజేత వుయీ (చైనీస్‌ తైపీ)ను జైస్మిన్‌ లాంబోరియా 4-1 తేడాతో కంగుతినిపించింది.
* 70 కిలోల విభాగంలో 18 నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన అరుంధతి చౌద‌రి ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అజీజా జోకిరోవాను 5-0తో చిత్తు చేసింది.
* 80ఫ్ల‌స్ కేజీల విభాగంలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సోటింబోయేవా ఒల్టినోయ్‌పై 3-2 తేడాతో నూపుర్ గెలుపొందింది.
* 60 కేజీల విభాగంలో జ‌పాన్‌కు చెందిన త‌గుచి అయాకా పై ప‌ర్వీన్ 3-2 తేడాతో విజ‌యం సాధించింది.

ఇక ప‌రుషుల విష‌యానికి వ‌స్తే.. 70 కిలోల విభాగంలో నార్‌బెక్‌ (కజకిస్థాన్‌)పై హితేశ్‌ గులియా, 60 కేజీల విభాగంలో మునార్‌బెక్‌ (కిర్గిజ్‌స్థాన్‌)పై సచిన్‌ సివాచ్ లు విజ‌యం సాధించి స్వ‌ర్ణ ప‌త‌కాలు కైవసం చేసుకున్నారు.

Mohammed Shami : భార‌త జ‌ట్టులోకి నో ఛాన్స్‌.. ష‌మీ కీల‌క నిర్ణ‌యం..!

జాదుమణి సింగ్‌ (50 కేజీ), అంకుశ్‌ (80 కేజీ), పవన్‌ (55 కేజీ), అబినాష్‌ (65 కేజీ), పూజ రాణి (80 కేజీ) ఫైనల్లో ఓడి ర‌జ‌త‌ప‌త‌కాల‌ను సాధించారు.