Afghanistan
Afghanistan vs Sri Lanka : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో సంచలనాలు ఆగడం లేదు. అఫ్గానిస్థాన్ మరో విజయం సాధించింది. పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో అఫ్గాన్‌కు ఇది మూడో విజయం కావడం విశేషం. ఇంతక ముందు పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లను ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. తద్వారా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ పై ఓటమితో శ్రీలంక సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
242 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 45.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (73 నాటౌట్; 63 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రహ్మత్ షా (62; 74 బంతుల్లో 7 ఫోర్లు), హష్మతుల్లా షాహిదీ (58 నాటౌట్ ; 74 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), లు హాఫ్ సెంచరీలు చేశారు. ఇబ్రహీం జద్రాన్ (39), రాణించారు. శ్రీలంక బౌలర్లో దిల్షన్ మధుశంక రెండు వికెట్లు తీశాడు. కసున్ రజిత ఓ వికెట్ పడగొట్టాడు.
Uncle Percy : బిగ్ షాక్.. అంకుల్ పెర్సీ కన్నుమూత.. సంతాపం తెలిపిన క్రికెటర్లు
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక (46; 60 బంతుల్లో 5 ఫోర్లు), కుశాల్ మెండిస్ (39; 50 బంతుల్లో 3 ఫోర్లు), సమరవిక్రమ (36; 40 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. మహేశ్ తీక్షణ 29, ఏంజెలో మాథ్యూస్ 23, అసలంక 22, కరుణరత్నే 15 పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్ బౌలర్లో ఫజల్హక్ ఫారూఖీ నాలుగు వికెట్లు తీశాడు. ముజీబ్ రెండు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒక్కొ వికెట్ సాధించారు.
Mohammed Shami : దిగ్గజాల రికార్డుకు అడుగుదూరంలో షమీ.. ఇదే ఫామ్‌తో ఇంకొక్క మ్యాచ్ ఆడితే..
Afghanistan continue their charge towards a top-four finish in #CWC23 with a stupendous win in Pune ?#AFGvSL ?: https://t.co/2lhrckvJl8 pic.twitter.com/bSSXPZHUJe
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2023