Uncle Percy : బిగ్ షాక్‌.. అంకుల్ పెర్సీ కన్నుమూత‌.. సంతాపం తెలిపిన క్రికెట‌ర్లు

క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే అంకుల్ పెర్సీ ఇక లేరు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం (అక్టోబ‌ర్ 30న‌) క‌న్నుమూశారు.

Uncle Percy : బిగ్ షాక్‌.. అంకుల్ పెర్సీ కన్నుమూత‌.. సంతాపం తెలిపిన క్రికెట‌ర్లు

Uncle Percy

Updated On : October 30, 2023 / 8:59 PM IST

Uncle Percy passes away : క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే అంకుల్ పెర్సీ ఇక లేరు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం (అక్టోబ‌ర్ 30న‌) క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 87 సంవ‌త్స‌రాలు శ్రీలంక క్రికెట్ జ‌ట్టుకు అంకుల్ పెర్సీ వీరాభిమాని. శ్రీలంక ఎక్క‌డ మ్యాచ్ ఆడినా స‌రే అక్క‌డి వెళ్లి జాతీయ జెండా పట్టుకుని త‌న జ‌ట్టుకు మ‌ద్ద‌తుగా నిలుస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో అంకుల్ పెర్సీ శ్రీలంక జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్న ఐకానిక్ చిత్రాలు క్రీడాభిమానుల మందిలో జ్ఞాప‌కాలుగా నిలిచిపోయాయి.

అంకుల్ పెర్సీ పూర్తి పేరు పెర్సీ అబేశేఖర. 1979 వ‌న్డే ప్రపంచ కప్ నుండి పెర్సీ అబేశేఖర జాతీయ జెండాను ప‌ట్టుకుని మైదానంలో వ‌చ్చి శ్రీలంక క్రికెట్ జట్టును ఉత్సాహపరిచేవారు. 2022 వ‌ర‌కు శ్రీలంక ఆడిన దాదాపు అన్ని అంత‌ర్జాతీయ మ్యాచ్‌లకు హాజరై ఉత్సాహ‌ప‌రిచారు. అయితే.. అనారోగ్యం కార‌ణంగా గ‌త ఏడాది కాలంగా అత‌డు మ్యాచ్‌ల‌కు హాజ‌రుకాలేక‌పోతున్నాడు. ఇంటికే ప‌రిమితం అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు అత‌డి వైద్య ఖ‌ర్చుల కోసం ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో రూ.50ల‌క్ష‌ల చెక్కును అంద‌జేసింది.

భార‌త క్రికెట‌ర్ల‌కు సుప‌రిచితుడే..

అంకుల్ పెర్సీ భార‌త క్రికెట‌ర్ల‌కు కూడా సుప‌రిచితుడే. అంకుల్ పెర్సీ కి క్రికెట్ పట్ల ఉన్న ఉత్సాహం అంతర్జాతీయ క్రికెటర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. 2015లో భారత జట్టు శ్రీలంక పర్యటన సందర్భంగా అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటగాళ్లలో అతనికి ఉన్న ఆదరణను గుర్తించి డ్రెస్సింగ్ రూమ్‌కి ఆహ్వానించాడు. ఈ ఏడాది ఆసియా క‌ప్ సంద‌ర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కొలంబో విమానాశ్ర‌యం స‌మీపంలోని అంకుల్ పెర్సీ ఇంటికి వెళ్లి అత‌డిని ప‌రామ‌ర్శించారు.

Mohammed Shami : దిగ్గ‌జాల రికార్డుకు అడుగుదూరంలో ష‌మీ.. ఇదే ఫామ్‌తో ఇంకొక్క‌ మ్యాచ్ ఆడితే..

 

క్రికెట‌ర్ల నివాళులు..

క్రికెట్‌కు వీరాభిమాని ఆయ‌న అంకుల్ పెర్సీ ఇక లేరు అనే విష‌యం తెలుసుకున్న ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా నివాళులు అర్పిస్తున్నారు. శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య, మాజీ ఆల్ రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ ల‌తో పాటు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ లు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Virat Kohli : కోహ్లీ కోసం ఈడెన్ గార్డెన్‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న క్యాబ్‌.. ఎందుకో తెలుసా..?