Virat Kohli : కోహ్లీ కోసం ఈడెన్ గార్డెన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న క్యాబ్.. ఎందుకో తెలుసా..?
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Virat Kohli
Virat Kohli Birthday : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో తనదైన శైలిలో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా.. నవంబర్ 5 న కోహ్లీ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సారి అతడి బర్త్ డే రోజున భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
కోహ్లీ పుట్టిన రోజును పురస్కరించుకుని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. 35వ పుట్టిన రోజు కోహ్లీకి ప్రత్యేకంగా గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కోహ్లీ కోసం ప్రత్యేకంగా కేక్ ను సిద్ధం చేస్తున్నారని స్పోర్ట్స్ టుడే నివేదిక వెల్లడించింది. క్యాబ్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ ఈ విషయాన్ని కన్ఫమ్ చేసినట్లు తెలిపింది.
AFG vs SL : అఫ్గానిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో అనూహ్య ఘటన..
‘విరాట్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకు కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కోహ్లీ కోసం ఓ ప్రత్యేక కేక్‌ను కూడా తయారు చేయిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడే అభిమానులకు చూపించలేము. ఇక మ్యాచ్ జరిగే సమయంలో ఇన్నింగ్స్ విరామ సమయంలో స్టేడియంలో లైటింగ్ షో, ఫైర్ వర్క్స్ ఏర్పాట్లు చేశాం. దాదాపు 70 వేల కోహ్లీ ఫేస్ మాస్కులను అందించబోతున్నాం.’ అని స్నేహాశిష్ చెప్పాడు.
ఇదిలా ఉంటే.. వన్డేల్లో విరాట్ కోహ్లీ 48 సెంచరీలు చేసి ఈ ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 49 వన్డే శతకాలు చేశాడు. కోహ్లీ ఈ ప్రపంచకప్‌లోనే సచిన్ రికార్డు బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అతడి పుట్టిన రోజు నాడే ఈ రికార్డు బద్దలు కొడితే అంతకు మించినది ఇంకా ఏం ఉండదని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. అలా జరగాలి ఉంటే.. ముంబైలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లోనే విరాట్ 49వ శతకం అందుకుంటేనే అది సాధ్యం అవుతుంది.
The CAB President said, “Eden Gardens is looking for something special for Virat Kohli’s birthday on 5th November”. (Sports Today). pic.twitter.com/eVMZmpxUnl
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023