Sania Mirza : కుమారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ సానియా మీర్జా పోస్ట్.. ఫోటోల్లో ఎక్కడా కనిపించని షోయబ్..
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Sania Mirza-Shoaib Malik
Sania Mirza-Shoaib Malik : భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చాన్నాళ్లుగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు అని చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలపై ఇటు సానియా మీర్జా గానీ, అటు పోయబ్ మాలిక్ గానీ ఇంతవరకు స్పందించలేదు. కాగా.. సానియా తన కుమారుడు ఇజాన్ కలిసి దుబాయ్‌లో నివసిస్తుండగా, షోయబ్ పాకిస్థాన్‌లో నివసిస్తుండడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.
తాజాగా కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా సానియా, షోయబ్‌లు దుబాయ్‌లో మినీ ప్రీ బర్త్‌డే వేడుక నిర్వహించారు. కాగా.. కుమారుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సానియా మీర్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో షోయబ్ మాలిక్ ఎక్కడా కనిపించపోవడంతో మరోసారి వీరి విడాకుల అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేడు (అక్టోబర్ 30న) ఇయాన్ పుట్టిన రోజు. నేటితో అతడికి ఐదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇజాన్ ఫోటోలను పోస్ట్ చేసింది.
Rachin Ravindra : ఆసీస్ పై రచిన్ రవీంద్ర సెంచరీ.. అతడి ప్రియురాలి పోస్ట్ వైరల్
“మా జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా చుట్టూ ఎంత చీకటిగా ఉన్నా, నీ చిరునవ్వు అన్నింటినీ మెరుగుపరుస్తుంది. మీతో నన్ను ఆశీర్వదించినందుకు నేను అల్లాకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజమైన ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియజేశావు. నీకు నా హృదయంలో ఎప్పటికీ స్థానం ఉంటుంది. ప్రతి సంవత్సరం నేను నిన్ను కొంచెం దగ్గరగా పట్టుకుంటాను. నీకు స్వేచ్ఛ ఇస్తూ నిన్ను ఇంకొంచెం దగ్గరగా కౌగిలించుకుటాను. అల్లా నిన్ను ఎల్లవేళలా ఆశీర్వదించును గాక.” అంటూ సానియా రాసుకొచ్చింది.
View this post on Instagram
షోయబ్ మాలిక్ షేర్ చేసిన ఫోటోల్లో కనిపించిన సానియా మీర్జా..
కుమారుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ షోయబ్ మాలిక్ ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోల్లో సానియా మీర్జా కనిపించింది. ‘హ్యాపీ బర్త్ డే బేటా.. బాబా నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు.’ అంటూ మాలిక్ రాసుకొచ్చాడు.
View this post on Instagram
షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో హైదరాబాద్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు.