Rachin Ravindra : ఆసీస్ పై రచిన్ రవీంద్ర సెంచరీ.. అతడి ప్రియురాలి పోస్ట్ వైరల్
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర పేరు మారుమోగిపోతుంది. వన్డే ప్రపంచకప్‌లో ఈ 23 ఏళ్ల ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు.

Rachin Ravindra-Premila Morar
Rachin Ravindra girlfriend : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర పేరు మారుమోగిపోతుంది. వన్డే ప్రపంచకప్‌లో ఈ 23 ఏళ్ల ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. శనివారం (అక్టోబర్ 28) ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రచిన్ శతకం బాదాడు. ఈ మెగా టోర్నీలో అతడికి ఇది రెండో సెంచరీ. టోర్నీ ఆరంభ మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగగా ఆ మ్యాచ్‌లో రచిన్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పై సెంచరీ చేసిన తరువాత రచిన్ ప్రియురాలు ప్రమీలా మోరార్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రచిన్ 89 బంతుల్లో ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 116 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అతడికి రెండో శతకం. ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లలో 24 ఏళ్లు నిండకముందే రెండు శతకాలు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. కాగా.. రచిన్ సెంచరీ చేసిన అనంతరం అతడి ప్రియురాలు ప్రమీలా మోరార్ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆమె అతని సంకల్పం, కృషి, ఆట పట్ల అచంచలమైన అంకితభావాన్ని కొనియాడింది.
ఆక్లాండ్‌లో జన్మించిన ప్రమీలా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కథనాన్ని పంచుకోవడం ద్వారా తన ప్రేమ, మద్దతును ప్రదర్శించింది. తన భాగస్వామి సాధించిన విజయాన్ని సంబరాలు చేసుకునేందుకు హత్తుకునే పోస్టును ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కాగా..రచిన్ రవీంద్ర, ప్రమీలా మోరార్ లు మూడేళ్లకు పైగా రిలేషన్ షిప్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (109) సెంచరీ బాదాడు. డేవిడ్ వార్నర్ (81) రాణించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫిలిప్స్ మూడేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్ రెండు, మాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం రచిన్ రవీంద్ర (116; 89 బంతుల్లో 9 ఫోర్లు, 5సిక్సర్లు) శతకం, డారిల్ మిచెల్ (54), జేమ్స్ నీషమ్ (58)లు హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ కూడా లక్ష్యానికి 10 పరుగుల దూరంలో కివీస్ నిలిచిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగలకే పరిమితమైంది.
Ratan Tata : క్రికెటర్ రషీద్‌ఖాన్‌కు 10 కోట్ల రివార్డు.. వాస్తవాలు వెల్లడించిన రతన్ టాటా