Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
![Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్ Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-17-1.jpg)
pic @ BCCI twitter
Virat Kohli breaks Anil Kumble record : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్(నాన్ వికెట్ కీపర్)గా రికార్డుల్లోకి ఎక్కాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోవడం ద్వారా విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ క్యాచ్‌తో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్‌లలో 15 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు. కుంబ్లే 14 క్యాచ్‌లు అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లలో టీమ్ఇండియా తరుపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లు వీరే (నాన్ వికెట్ కీపర్)
విరాట్ కోహ్లీ -15
అనిల్ కుంబ్లే – 14
కపిల్ దేవ్ – 12
సచిన్ టెండూల్కర్ -12
కాగా.. విరాట్ కోహ్లీకి ఇది నాలుగో వన్డే ప్రపంచకప్ అన్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. బుమ్రా ధాటికి మూడో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 16/1. డేవిడ్ వార్నర్ (5), స్టీవ్ స్మిత్ (11) లు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
Milestone Unlocked! 🔓
Virat Kohli now has most catches for India in ODI World Cups as a fielder 😎#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/HlLTDqo7iZ
— BCCI (@BCCI) October 8, 2023