WPL 2023, Mumbai vs Bangalore-Live Updates: బెంగళూరుపై ముంబై ఘనవిజయం, హేలీ ధనాధన్ బ్యాటింగ్

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

WPL 2023, Mumbai vs Bangalore-Live Updates: బెంగళూరుపై ముంబై ఘనవిజయం, హేలీ ధనాధన్ బ్యాటింగ్

Live Updates

Updated On : March 6, 2023 / 10:37 PM IST

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. మరో 34 బంతులు మిగిలి ఉండగానే.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 14.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలుపొందింది.

ముంబై జట్టులో ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ దంచికొట్టింది. 38 బంతుల్లోనే 77 పరుగులు చేసింది. ఆమె స్కోర్ లో 13 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. నాట్ స్కీవర్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగింది. 29 బంతుల్లోనే 55 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 18.4 ఓవర్లలోనే 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 06 Mar 2023 10:35 PM (IST)

    ముంబై గ్రాండ్ విక్టరీ

    విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. మరో 34 బంతులు మిగిలి ఉండగానే.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

  • 06 Mar 2023 10:26 PM (IST)

    విజయానికి చేరువలో ముంబై, దంచికొడుతున్న హేలీ

    ముంబై ఇండియన్స్ జట్టు విజయానికి చేరువలో ఉంది. 13 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ దంచి కొడుతోంది. హాఫ్ సెంచరీ బాదింది. ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తోంది. 36 బంతుల్లోనే 75 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో 13ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి.

  • 06 Mar 2023 09:14 PM (IST)

    బెంగళూరు ఆలౌట్

    బెంగళూరు జట్టు 18.4 ఓవర్ల వద్ద ఆలౌట్ అయింది. ముంబై జట్టు ముందు బెంగళూరు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై జట్టులో రిచా ఘోష్ (28 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచింది. స్మృతి మంధాన 23, శ్రేయాంక 23 పరుగులు చేశారు.

  • 06 Mar 2023 09:13 PM (IST)

    రేణుకా సింగ్ ఔట్

    బెంగళూరు జట్టు 9వ వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ 2 పరుగులకు ఔట్ అయింది.

  • 06 Mar 2023 09:08 PM (IST)

    8వ వికెట్ డౌన్

    బెంగళూరు జట్టు 8వ వికెట్ కోల్పోయింది. శ్రేయాంక 23 పరుగులకు ఔట్ అయింది. క్రీజులో మేఘాన్ (18), రేణుక (0) ఉన్నారు. బెంగళూరు స్కోరు 150/8 (17.1/20)గా ఉంది.

  • 06 Mar 2023 08:48 PM (IST)

    7 వికెట్లు కోల్పోయిన బెంగళూరు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్లు కోల్పోయింది. రిచా ఘోష్ 28, అహుజా 22 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాంక, మేఘాన్ ఉన్నారు. బెంగళూరు స్కోరు 112/7 (13.3/20)గా ఉంది.

  • 06 Mar 2023 08:21 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన బెంగళూరు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5వ వికెట్ కోల్పోయింది. పెర్రీ 13 పరుగులు చేసి వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజులో రిచా ఘోష్ 20, అహుజా 2 పరుగులతో ఉన్నారు. స్కోరు 76/5 (9.0/20) గా ఉంది.

     

  • 06 Mar 2023 07:55 PM (IST)

    వెనువెంటనే 4 వికెట్లు కోల్పోయిన బెంగళూరు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెనువెంటనే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డివైన్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దిశ డకౌట్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత స్మృతి మంధాన (23), హీథర్ నైట్ (డకౌట్) వెనుదిరిగారు. స్కోరు ప్రస్తుతం 47/4గా ఉంది. ముంబై బౌలర్లు హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్ రెండేసి వికెట్లు తీశారు.

  • 06 Mar 2023 07:47 PM (IST)

    4 ఓవర్లకు బెంగళూరు స్కోరు 35

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్ తొలి ఓవర్లలో దూకుడుగా ఆడారు. స్మృతి మంధాన 14 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 19 పరుగులు చేసింది. సోఫి 9 బంతుల్లో ఒక సిక్సు, ఒక ఫోరు సాయంతో 12 పరుగులు చేసింది. స్కోరు 35/0 (4.0/20)గా ఉంది.

  • 06 Mar 2023 07:14 PM (IST)

    ముంబై జట్టు

    హర్మన్‌ ప్రీత్ కౌర్, నటాలీ, హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, యాస్తిక భాటియా, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్.

    Mumbai Team

    Mumbai Team

  • 06 Mar 2023 07:12 PM (IST)

    బెంగళూరు జట్టు

    హీథర్ నైట్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, మేఘాన్ షట్, స్మృతి మంధాన, ప్రీతి బోస్, రేణుకా సింగ్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, దిశా.

    Royal Challengers Bangalore Team

    Royal Challengers Bangalore Team