wpl 2025 7 matchs complete who won the toss thhey win the matchs
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ఈ ఏడు మ్యాచ్‌లను గమనిస్తే ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు టాస్ గెలవడం.. ఫీల్డింగ్ ఎంచుకోవడం.. లక్ష్యం ఎంతైనా ఛేదించడం.. ప్రతి జట్టూ ఇదే చేస్తోంది. ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ ఛేదన చేసిన జట్లే విజయాన్ని సాధించాయి.
తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అయితే.. ఈ భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలడపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. 19.1 ఓవర్లలో 164 పరుగులకు కుప్పకూలింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సరిగ్గా 20 ఓవర్ ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
IND vs PAK : పాకిస్తాన్‌తో మ్యాచ్.. వరల్డ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
ఇక మూడో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని గుజరాత్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నాలుగో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆర్‌సీబీ లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ముంబై 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
ఆరో మ్యాచ్ యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో యూపీ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఏడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ముంబై 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఇప్పటి వరకు టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకుని ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించాయి. మరి మిగిలిన మ్యాచ్‌ల్లో ఇదే ఒరవడి కొనసాగుతుందా? దీనికి బ్రేక్ పడతుందా అన్నది చూడాలి మరి.