Champions Trophy 2025 points table : బంగ్లాదేశ్ పై గెలిచినా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే భారత్.. సెమీస్ చేరాలంటే..
బంగ్లాదేశ్ పై విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Champions Trophy 2025 points table Team India Semifinal Scenario details here
ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భారత్ ఆరాటపడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూపు-ఏలో ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 0.408 నెట్ రన్‌ను సాధించింది. భారత్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు ఉన్నాయి.
ఇక పాకిస్తాన్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఖాతాలోనూ రెండు పాయింట్లే ఉన్నప్పటికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత నెట్ రన్‌రేటు కంటే కివీస్ నెట్ రన్‌రేటు (+1.200) అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఇక బంగ్లాదేశ్ మూడో స్థానంలో పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
IND vs BAN : బంగ్లాదేశ్ పై విజయం.. బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికో తెలుసా?
గ్రూపు-ఏలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే. భారత జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆదివారం పాకిస్తాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. ఆదివారం పాక్‌తో మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంటుంది.
అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరుతాయి. అదే సమయంలో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ పాక్ చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం అప్పుడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమ్ఇండియా తప్పక గెలవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం కావొచ్చు.
ఇక బంగ్లాదేశ్ విషయాని వస్తే.. పాక్‌తో పోలిస్తే బంగ్లా నెట్‌రన్‌రేట్ కాస్త బెటర్. అయినప్పటికి ఆ జట్టు తదుపరి న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీస్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. అయితే.. అది కాస్త కష్టమైన పని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాక్ విషయానికి వస్తే.. భారత్, బంగ్లాదేశ్ పై తప్పక గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
మొత్తం 8 జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలో ఉన్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. గ్రూపు-బి మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభం అవుతాయి. నేడు అఫ్గానిస్తాన్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.