IND vs BAN : అక్షర్ పటేల్ హ్యాట్రిక్ ఛాన్స్ తన వల్ల చేజారడం పై కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్.. అది ఈజీ క్యాచ్.. రేపు అతడిని..
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించే అవకాశం తన వల్ల చేజారడం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

it was an easy catch I should have taken that Rohit comments after drop catch of Hat trick ball
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో హ్యాట్రిక్ తీసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అవకాశం చేజారితే ఆ బాధ వర్ణనాతీతం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది కూడా సులువైన క్యాచ్‌ను ఫీల్డర్ వదిలేస్తే.. ఆ బౌలర్ పరిస్థితి చెప్పడానికి మాటలు రావడం లేదు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమ్ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్‌పటేల్‌కు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. సిప్ల్‌లో ఎంతో సులువైన క్యాచ్‌ను రోహిత్ శర్మ వదిలేశాడు. మ్యాచ్ అనంతరం దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
అది ఎంతో సులువైన క్యాచ్ అని అన్నాడు. తప్పకుండా తాను ఆ క్యాచ్‌ను అందుకోవాల్సింది అని తెలిపాడు. అక్షర్‌ను కూల్ చేసేందుకు రేపు అతడిని డిన్నర్‌కు తీసుకువెళ్లాలని రోహిత్ శర్మ నవ్వుతూ చెప్పాడు. కాగా.. మైదానంలోనే తన తప్పుకు అక్షర్‌కు రోహిత్ శర్మ క్షమాపణలు చెప్పాడు.
IND vs BAN : ఐదో వికెట్ తీసిన తరువాత షమీ ‘ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్’.. తన ఇష్టాన్ని ఇలా..
Rohit Sharma said “May take him for dinner tomorrow (smiles) – it was an easy catch, I should have taken that”. [Talking about the drop catch of Hat-trick ball] pic.twitter.com/qagPyZNreB
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
అప్పటికే సంబరాలు మొదలు పెట్టా..
కాగా.. హ్యాట్రిక్ మిస్ కావడం పై అంతకముందు అక్షర్ పటేల్ స్పందించాడు. నిజాయితీగా చెప్పాలంటే తాను అప్పటికే సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పాడు. బాల్ రోహిత్ వద్దకు వెళ్లినప్పుడు క్యాచ్ పట్టుకుంటాడని భావించాను. అయితే.. హిట్‌మ్యాన్ క్యాచ్‌ను వదిలివేసినట్లు ఆతరువాత గుర్తించాను. క్రికెట్‌లో అప్పుడప్పుడు ఇలాంటివన్నీ సహజమేనని అక్షర్ చెప్పుకొచ్చాడు.
అందుకే తాను దీనిపై పెద్దగా స్పందించలేదన్నాడు. ఆ వెంటనే తిరిగి మరో బాల్ వేసేందుకు సిద్ధం అయ్యాను అని తెలిపాడు. కాగా.. తొలి వికెట్ ను తాను నమ్మలేకపోయానన్నాడు. తంజిద్ ఔట్ అయినట్లు తనకు తెలియదన్నాడు. అయితే.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రం ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అందుకనే అతడు ఎక్కువగా అప్పీల్ చేశాడు. ఆ తరువాత మరో అద్భుత బంతితో రెండో వికెట్ దక్కిందన్నాడు. ఆ తరువాత హ్యాట్రిక్ కోసం ప్రయత్నించానని, దురదృష్ట వశాత్తు పూర్తి చేసుకోలేకపోయానని అక్షర్ తెలిపాడు.