IND vs BAN : వన్డేల్లో రోహిత్ శర్మ 11000 రన్స్.. సచిన్, పాంటింగ్, గంగూలీ, సంగక్కరల రికార్డులు బ్రేక్..
వన్డేల్లో రోహిత్ శర్మ 11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

Rohit sharma 11000 runs in ODI's
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో 11 వేల పరుగులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ దీన్ని సాధించాడు. వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద హిట్‌మ్యాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు.
ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్, గంగూలీ, పాంటింగ్‌ల రికార్డును బ్రేక్ చేశాడు. 276 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని చేరుకోగా రోహిత్ శర్మ కేవలం 261 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా పదుకొండు వేల పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 11వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ (భారత్) – 222 ఇన్నింగ్స్‌ల్లో
రోహిత్ శర్మ (భారత్) – 261 ఇన్నింగ్స్‌ల్లో
సచిన్ టెండూల్కర్ (భారత్) – 276 ఇన్నింగ్స్‌ల్లో
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 286 ఇన్నింగ్స్‌ల్లో
సౌరవ్ గంగూలీ (భారత్) – 288 ఇన్నింగ్స్‌ల్లో
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 293 ఇన్నింగ్స్‌ల్లో
వన్డేల్లో 11వేల క్లబ్‌లో అడుగుపెట్టిన పదో ఆటగాడిగా..
అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో 11వేల పరుగులు పూర్తి చేసుకున్న పదో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. అతడి కంటే ముందు కేవలం 9 మంది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాడు. 18,426 పరుగులతో వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత సంగక్కర, కోహ్లీలు ఉన్నారు.
వన్డేల్లో 11000 ఫ్లస్ రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 18,426 పరుగులు
* కుమార సంగక్కర (శ్రీలంక) – 14, 234 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – 13,963 పరుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13,704 పరుగులు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 13,430 పరుగులు
* జయవర్థనే (శ్రీలంక) – 12,650 పరుగులు
* ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) – 11,739 పరుగులు
* జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 11579 పరుగులు
* సౌరవ్ గంగూలీ (భారత్) – 11363 పరుగులు
* రోహిత్ శర్మ (భారత్) – 11001* పరుగులు