IND vs BAN : ఐదో వికెట్ తీసిన తరువాత షమీ ‘ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్’.. తన ఇష్టాన్ని ఇలా..
ఐదో వికెట్ తీసిన తరువాత షమీ ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

Mohammed Shami explains flying kiss celebration after the match
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయం సాధించడంలో టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. సౌమ్య సర్కార్ (0), మెహిదీ హసన్ మిరాజ్ (5), జాకర్ అలీ (68), తంజిమ్ హసన్ సకిబ్ (0), తస్కిన్ అహ్మద్ (3)లను షమీ పెవిలియన్‌కు చేర్చడంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో కేవలం 228 పరుగులకే ఆలౌట్ అయింది.
కాగా.. ఐదో వికెట్ తీసిన అనంతరం షమీ చేసిన సెలబ్రేషన్స్ వైరల్ అయ్యాయి. తస్కిన్‌ను ఔట్ చేసినప్పుడు షమీ ప్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం షమీ తన సెలబ్రేషన్స్ పై స్పందించాడు. తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు చెప్పేందుకే ఇలా చేసినట్లుగా వెల్లడించాడు. కాగా.. షమీ తండ్రి 2017లో మరణించారు.
Shami said “That flying kiss was for my father, he is my role model”. [Sahil Malhotra from TOI] pic.twitter.com/Ttp1FtmqKz
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
‘అది నా తండ్రి కోసమే. ఎందుకంటే ఆయన నాకు ఆదర్శం. ఆయన ఎల్లప్పుడు నాకు తోడుగా ఉంటారు.’ అని షమీ చెప్పాడు.
ఐసీసీ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా..
ఐసీసీ వన్డే ఈవెంట్లలలో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ఐసీసీ ఈవెంట్లలలో తన వికెట్ల సంఖ్యను 60కి పెంచుకున్నాడు. ఈ క్రమంలో మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను అధిగమించాడు. జహీర్ 32 ఇన్నింగ్స్‌ల్లో 59 వికెట్లు తీయగా.. షమీ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను దాటాడు.
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (101నాటౌట్; 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో 229 లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41), కేఎల్ రాహుల్ (41 నాటౌట్) లు రాణించగా విరాట్ కోహ్లీ (22) ఫర్వాలేదనిపించాడు.
దుబాయ్ వేదికగానే భారత్ ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.