IND vs BAN : బంగ్లాదేశ్ పై విజయం.. బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికో తెలుసా?
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తరువాత బెస్ట్ పీల్డర్ మెడల్ ఎవరికి ఇచ్చారంటే

DO you know who is won the BEST FIELDER MEDAL after bangladesh match in Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (100; 118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. జాకర్ అలీ (68; 114 బంతుల్లో 4 ఫోర్లు)హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం శుభ్‌మన్ గిల్ (101 నాటౌట్; 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. కేఎల్ రాహుల్ (41 నాటౌట్), రోహిత్ శర్మ (41)లు రాణించారు. విరాట్ కోహ్లీ (22) ఫర్వాలేదనిపించాడు. శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8)లు విఫలం అయ్యారు.
𝘿𝙧𝙚𝙨𝙨𝙞𝙣𝙜 𝙍𝙤𝙤𝙢 𝘽𝙏𝙎 | 𝙁𝙞𝙚𝙡𝙙𝙚𝙧 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙈𝙖𝙩𝙘𝙝 | #BANvIND
A BIG start to #ChampionsTrophy 2025 🙌
The fielder of the match 🏅 for our first game of the tournament goes to 🥁
WATCH 🎥🔽 #TeamIndiahttps://t.co/8rWspNG0wb
— BCCI (@BCCI) February 21, 2025
బెస్ట్ ఫీల్డర్ అవార్డు..
ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన తరువాత ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్న ఆటగాళ్లకు బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఇస్తూ వస్తోంది. స్వదేశంలో 2023 వన్డే ప్రపంచకప్ నాటి నుంచి ఇది ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇక తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగాదేశ్‌తో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందించారు. వికెట్ కీపింగ్‌లో ఆకట్టుకున్నందుకు కేఎల్ రాహుల్‌ను బెస్ట్ ఫీల్డర్ అవార్డు వరించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేతుల మీదుగా రాహుల్ ఈ మెడల్‌ను అందుకున్నాడు.
ఇక టీమ్ఇండియా తన తదుపరి మ్యాచ్‌ను దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగానే ఆడనుంది. ఆదివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. పాక్ పై విజయం సాధించి సెమీస్ కు చేరుకోవాలని భారత్ ఆరాటపడుతోంది. మరోవైపు పాక్‌కు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి ఇంటి బాట పట్టాల్సిందే.