Wrestlers protest: అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ భర్త సత్యవర్త్ ఆగ్రహం

ఐక్యంగా న్యాయం కోసం పోరాడతామని, తమ ఉద్యమాన్ని బలహీనపర్చడానికే అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారని రెజ్లర్లు అంటున్నారు.

Wrestlers protest – Sakshi Malik:  రెజ్లర్ల ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని భజరంగ్ పునియా ( Bajrang Punia) తెలిపారు. రెజ్లర్లకు నష్టం చేసేందుకే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమ పోరాటంపై వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

ఉద్యమాన్ని ఉపసంహరించుకోలేదని పునియా అన్నారు. మహిళా రెజ్లర్లు ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకున్నారన్న వార్త కూడా అవాస్తవంమని చెప్పారు. తాము న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

తాను రెజ్లర్ల ఉద్యమం నుంచి తప్పుకోలేదని ట్విట్టర్ వేదికగా సాక్షి మాలిక్ (Sakshi Malik) కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. రెజ్లర్ల ఉద్యమంపై సాక్షి మాలిక్ భర్త, రెజ్లర్ సత్యవర్త్ కడియన్ మీడియాతో మాట్లాడారు. ” మేము రాజీ పడలేదు. వెనక్కి తగ్గలేదు. మాపై వస్తోన్న ప్రచారంలో నిజం లేదు. ఉద్యమాన్ని కొనసాగిస్తాం.

మేము ఐక్యంగా న్యాయం కోసం పోరాడతాం. మమ్మల్ని బలహీనపర్చడానికే అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా దేశం మొత్తం ఉంది” అని భర్త సత్యవర్త్ చెప్పారు.

రైల్వే కార్యాలయంలో ఉద్యోగంలో చేరాక సాక్షిమాలిక్ ఇంటికి వచ్చింది. ఆమె మీడియాతో మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు