WTC Final 2023: క‌ష్టాల్లో టీమ్ఇండియా

లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది.

WTC Final 2023: క‌ష్టాల్లో టీమ్ఇండియా

wtc final day 4

Updated On : June 10, 2023 / 9:28 PM IST

WTC Final: లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270/8 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేయ‌గా భార‌త్ ముందు 444 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Jun 2023 09:30 PM (IST)

    పుజారా ఔట్‌

    భార‌త్‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. పుజ‌రా(27) ఔట్ అయ్యాడు. క‌మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ కేరీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 93 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది.

  • 10 Jun 2023 09:05 PM (IST)

    రోహిత్ శ‌ర్మ ఔట్‌

    టీమ్ఇండియాకు మ‌రో షాక్ త‌గిలింది. ధాటిగా ఆడుతున్న రోహిత్ శ‌ర్మ(43) ఔట్ అయ్యాడు. నాథ‌న్ లియాన్ బౌలింగ్‌లో ఎల్భీగా ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 92 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

  • 10 Jun 2023 07:50 PM (IST)

    గిల్ ఔట్‌

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. దూకుడుగా ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్(18) ఔట్ అయ్యాడు. బొలాండ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ అద్భుత క్యాచ్ అందుకోవ‌డంతో గిల్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 41 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో టీ విరామం ప్ర‌క‌టించారు అంపైర్లు. టీ బ్రేక్‌కు భార‌త్ 41/1తో నిలిచింది.

  • 10 Jun 2023 06:51 PM (IST)

    టీమ్ఇండియా టార్గెట్ 444

    ఆస్ట్రేలియా త‌న రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ష‌మీ బౌలింగ్‌లో క‌మిన్స్ ఔట్ కావ‌డంతో 270 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ 8వ వికెట్ కోల్పోయింది. ఆ వెంట‌నే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని క‌లుపుకుని 443 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే 444 ప‌రుగులు చేయాలి.

  • 10 Jun 2023 06:24 PM (IST)

    అలెక్స్ కేరీ అర్ధ‌శ‌త‌కం

    ఆసీస్ వికెట్ కీప‌ర్ అలెక్స్ కేరీ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. జ‌డేజా బౌలింగ్‌లో(66.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి అత‌డు ఈ మార్క్‌ను చేరుకున్నాడు.

  • 10 Jun 2023 05:13 PM (IST)

    లంచ్ బ్రేక్‌

    డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప‌ట్టు బిగించింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 123/4 తో నాలుగో రోజు ఆట‌ను కొన‌సాగించిన ఆస్ట్రేలియా లంచ్ విరామానికి 6 వికెట్లు న‌ష్ట‌పోయి 201 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని క‌లుపుకుని ప్ర‌స్తుతం ఆసీస్ 374 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అలెక్స్ కేరీ 41, మిచెల్ స్టార్క్ 11 ఉన్నారు.

  • 10 Jun 2023 04:35 PM (IST)

    కామెరూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్‌

    ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ (25) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 167 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

  • 10 Jun 2023 03:33 PM (IST)

    ల‌బుషేన్ ఔట్‌

    ఓవ‌ర్ నైట్ స్కోరు 123/4 తో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట‌ను ప్రారంభించింది. మ్యాచ్ ఆరంభ‌మైన మూడో ఓవ‌ర్‌లోనే బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. నిన్న భార‌త బౌల‌ర్ల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన ల‌బుషేన్ ఔట్ అయ్యాడు. ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్‌లో పుజారా క్యాచ్ అందుకోవ‌డంతో అత‌డు పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 124 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.