Yashasvi Jaiswal Eye on 49 Year Old Record ahead of 2nd Test At Edgbaston
జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 97 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. జైస్వాల్ ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడాడు. 52.86 సగటుతో 1903 పరుగులు సాధించాడు.
టీమ్ఇండియా తరుపున టెస్టుల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన ఆటగాడి రికార్డు ప్రస్తుతం దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ 23 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 1976 ఏప్రిల్ 7 నుంచి 12 వరకు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ ఈ రికార్డు సాధించాడు. గవాస్కర్ తరువాత ఈ జాబితాలో గంభీర్, ద్రవిడ్ లు ఉన్నారు.
Gautam Gambhir : గంభీర్ కోచ్ పదవికి ఎసరు.. గెలిచిన మ్యాచ్‌ల కంటే ఓడిందే ఎక్కువ..
టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* సునీల్ గవాస్కర్ – 23 మ్యాచ్‌లు
* గౌతమ్ గంభీర్ – 24 మ్యాచ్‌లు
* రాహుల్ ద్రవిడ్ – 25 మ్యాచ్‌లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 25 మ్యాచ్‌లు
* విజయ్ హజారే – 26 మ్యాచ్‌లు
* చెతేశ్వర్ పుజారా – 26 మ్యాచ్‌లు
* సౌరవ్ గంగూలీ – 27 మ్యాచ్‌లు
* శిఖర్ ధావన్ – 28 మ్యాచ్‌లు
* పటౌడీ – 28 మ్యాచ్‌లు
*అజింక్యా రహానే – 29 మ్యాచ్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో ఎలాగైన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ను 1-1తో సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోవాలని భావిస్తోంది.