ENG vs IND : రెండో టెస్టులోనూ భారత్‌ను ఓడించేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ఫ్లాన్.. వికెట్ల వీరుడికి జట్టులో చోటు..
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ENG vs IND Archer included in England squad for second Test
అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పై ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఇదే ఉత్సాహంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి జరగనున్న రెండో టెస్టులో గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాలుగేళ్ల తరువాత టెస్టు జట్టులోకి ఆర్చర్ రావడం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో భారత్ పై చివరి టెస్టు మ్యాచ్‌ను ఆడాడు. ఆ తరువాత గాయాల కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ఇండియా పై మ్యాచ్‌తోనే అతడు పునరాగమనం చేయనుండం గమనార్హం.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్.. భారత్‌కు మరో షాక్.. బుమ్రాతో పాటు మరో పేసర్ ఔట్!
“జాతీయ జట్టు తరఫున 13 టెస్టులు ఆడిన 30 ఏళ్ల జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. 2021 ఫిబ్రవరిలో భారత్‌పైనే చివరి టెస్టు ఆడిన అతడు.. మళ్లీ టీమిండియాపైనే పునరాగమనం చేస్తున్నాడు.” అని ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు లేవంది.
భారత్‌తో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.