ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్.. భారత్‌కు మరో షాక్.. బుమ్రాతో పాటు మరో పేసర్ ఔట్!
జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మరో పేసర్ సైతం మ్యాచ్ ఆడకపోవచ్చునని అంటున్నారు.

ENG vs IND Prasidh Krishna to miss the second Test
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఓటమితో మొదలెట్టింది. ప్రస్తుతం 0-1తో వెనుకబడిన టీమ్ఇండియా జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. ఇక ఇప్పటికే ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు దూరం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కారణంగా బుమ్రాను ముందుగానే మూడు మ్యాచ్‌ల్లోనే ఆడించాలని టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా పాల్గొనలేదు. దీంతో అతడు రెండో టెస్టులో ఆడడను అన్న సంగతి అర్థమవుతోంది. ఇక ఇప్పుడు అతడితో పాటు మరో పేసర్ సైతం మ్యాచ్ ఆడకపోవచ్చునని అంటున్నారు.
ICC : టీ20ల్లో కొత్త రూల్.. ఇక పై ఓవర్లు కాదు.. బంతులే లెక్క..
INDIAN PRACTICE UPDATE ✅
– Long chats between Gautam Gambhir & Arshdeep, Akash Deep. [Sahil Malhotra from TOI] pic.twitter.com/4uWDH3rx4V
— Johns. (@CricCrazyJohns) June 27, 2025
తొలి టెస్టులో ధారాళంగా పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ సైతం శుక్రవారం నెట్ సెషన్‌లో పాల్గొనలేదు. అతడు 6 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. అయితే.. 5 వికెట్లు మాత్రం తీశాడు. బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ ప్రాక్టీస్ చేయకపోవడంతో టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ రెండో టెస్టులో సరికొత్త బౌలింగ్ కాంబినేషన్లను పరిశీలిస్తుస్తోందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నెట్ సెషన్ సమయంలో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ లతో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌తో సుదీర్ఘ చర్చలు జరపడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఒక స్థానం కోసం ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని సూచించినప్పటికీ, ప్రసిద్ధ్ కృష్ణ దూరం అయితే ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఇద్దరూ కూడా రెండో టెస్టులో ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఈ మ్యాచ్ ద్వారానే అర్ష్‌దీప్ టెస్టు అరంగ్రేటం చేయనున్నాడు.