Yashasvi Jaiswal : జైస్వాల్ మామూలోడు కాదుగా.. కొడితే.. ప్ర‌పంచ రికార్డు..

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో యువ భార‌త్ అద‌ర‌గొట్టింది.

Yashasvi Jaiswal Smashes World Record Against Zimbabwe

Yashasvi Jaiswal World Record : జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో యువ భార‌త్ అద‌ర‌గొట్టింది. 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకుంది. ఆదివారం హ‌రారే వేదిక‌గా జ‌రిగిన‌ ఐదో టీ20 మ్యాచ్‌లో భార‌త్ 42 ప‌రుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒక్క‌ బంతికే 13 ప‌రుగులు సాధించి చ‌రిత్ర సృష్టించాడు.

మొద‌టి ఓవ‌ర్‌ను సికింద‌ర్ ర‌జా వేశాడు. తొలి బంతిని హై పుల్ టాస్‌గా వేశాడు. దీన్ని జైస్వాల్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స‌ర్‌గా మ‌లిచాడు. అయితే.. ర‌జా క్రీజు దాటి బాల్ వేయ‌డంతో అంపైర్ నోబాల్‌గా ప్ర‌క‌టించాడు. ఫ్రీ హిట్ బంతిని సిక్స్ బాదాడు జైస్వాల్‌. దీంతో ఒక్క లీగ‌ల్ డెలివ‌రీకి 13 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి బంతికి 12 ప‌రుగులు చేసిన మొద‌టి క్రికెట‌ర్‌గా జైస్వాల్ నిలిచాడు.

Rohit Sharma : వ‌న్డేల్లో, టెస్టుల్లో రిటైర్‌మెంట్ పై రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు..

వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు బాది ఊపుమీద క‌నిపించినా జైస్వాల్.. నాలుగో బంతికి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో సంజూ శాంస‌న్ (58) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. రియాన్ ప‌రాగ్ (22), శివ‌మ్ దూబె (26) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్లెస్సింగ్ ముజరబానీ రెండు వికెట్లు తీశాడు. బ్రాండన్ మవుటా, సికింద‌ర్ ర‌జా, రిచర్డ్ నగరవ త‌లా ఓ వికెట్ తీశారు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో జింబాబ్వే 18.3 ఓవ‌ర్ల‌లో 125 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. జింబాబ్వే బ్యాటర్లలో మేయర్స్ (34), మరుమని (27) లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ముకేశ్‌ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు. శివ‌మ్ దూబె రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుంద‌ర్‌, అభిషేక్ శ‌ర్మ‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Lionel Messi cries : అయ్యో దేవుడా మెస్సీని ఇలా చూడ‌లేమ‌య్యా.. కోపా అమెరికా క‌ప్ ఫైన‌ల్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.

ట్రెండింగ్ వార్తలు