స్లిప్‌లో జైస్వాల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ ఆట‌గాడు జో రూట్‌

జో రూట్‌ను పెవిలియ‌న్‌కు చేర్చ‌డం ద్వారా జ‌ట్టుకు శుభారంభం అందించాడు భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా.

Yashasvi Jaiswal’s brilliant catch : భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా శ‌నివారం రాజ్‌కోట్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచులో మూడో రోజు ఆట ప్రారంభంలో జో రూట్‌ను పెవిలియ‌న్‌కు చేర్చ‌డం ద్వారా జ‌ట్టుకు శుభారంభం అందించాడు.

ఓవ‌ర్ నైట్ స్కోరు 35 ఓవర్లలో 207/2 తో మూడో రోజు ఆట‌ను ఇంగ్లాండ్ ఆరంభించింది. బెన్‌డ‌కెట్ (133; 118 బంతుల్లో 21 ఫోర్లు, 2సిక్స‌ర్లు ), జోరూట్ (9) లు భార‌త బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నారు. టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఫ్యామిలీ మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా టెస్టు మ్యాచ్ నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకున్నాడు. దీంతో టీమ్ఇండియా బౌలింగ్ భారం మొత్తం బుమ్రా పై ప‌డింది.

అయితే.. బుమ్రా త‌న బాధ్య‌త‌ను చ‌క్క‌గా నిర్వ‌ర్తిస్తున్నారు. ఓవ‌ర్ నైట్ స్కోరుకు మ‌రో 17 ప‌రుగులు మాత్ర‌మే జోడించిన ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో జో రూట్ (18) రివ‌ర్స్ ల్యాప్‌కు వెళ్లాడు. అయితే.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు త‌గిలింది. రెండో స్లిప్‌లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్ చ‌క్క‌టి క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs ENG : భారత జట్టుకు బిగ్ షాక్ .. మూడో టెస్టు నుంచి అర్థాంతరంగా వైదొలగిన అశ్విన్

టెస్టు క్రికెట్‌లో జోరూట్ పై బుమ్రా ఆధిప‌త్యం మ‌రింత పెరిగింది. 21 ఇన్నింగ్స్‌ల్లో 9 సార్లు జోరూట్‌ను బుమ్రా ఔట్ చేశాడు. ప్ర‌స్తుత సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు పెవిలియ‌న్‌కు చేర్చాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లో జానీబెయిర్ స్టో (0) ను కుల్దీప్ యాద‌వ్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ 225 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

ట్రెండింగ్ వార్తలు