నెహ్రాపై ఫిర్యాదు చేసిన యువరాజ్ సింగ్

భారత జట్టు ఆటగాడు యువరాజ్ సింగ్ భారత జట్టు మాజీ క్రికెటర్, బౌలర్ ఆశీష్ నెహ్రాపై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఎవరికి ఫిర్యాదు చేశాడు అనుకుంటున్నారా? విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ తెలుసుకోవాల్సిందే. గురువారం నాడు యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్ బర్త్‌డే ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ పార్టీలో మాజీ క్రికెటర్ నెహ్రా, యువరాజ్ సింగ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నెహ్రా అయితే డ్యాన్స్ చేస్తూ వెళ్లి కేక్ ముక్క తీసి కీచ్ ముఖంపై పూసేశాడు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్న యువరాజ్.. హాజెల్ ముఖంపై నెహ్రా కేక్ పూయడాన్ని ప్రస్తావిస్తూ.. రుష్మా నెహ్రా.. ‘‘చూడు.. మీ ఆయన నా భార్య ముఖాన్ని ఎలా చేశాడో’’ అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెహ్రా భార్యకు ఫిర్యాదు చేశాడు. యువరాజ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెహ్రకు, యువరాజ్ కు మధ్య ఉన్న అనుబంధం గురంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువరాజ్ సింగ్ చేసిన ఇన్ స్టాగ్రమ్ పోస్ట్ వారి మధ్య అనుబంధాన్ని తెలుపుతుంది.