WCL 2025 : యువీ నాయ‌క‌త్వంలో మ‌రోసారి మైదానంలోకి దిగ‌నున్న రైనా, ధావ‌న్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌.. భార‌త జ‌ట్టు ఇదే..

యువ‌రాజ్ సింగ్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగ‌నుంది.

Yuvraj Singh lead the India Champions in WCL Season 2

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టోర్నీల్లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌)ఒక‌టి. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆట‌గాళ్లు ఆడే ఈ టోర్నీలో దిగ్గ‌జ ఆట‌గాళ్ల విన్యాసాల‌ను మ‌రోసారి మైదానంలో ఆస్వాదించ‌వ‌చ్చు.

డ‌బ్ల్యూసీఎల్ తొలి సీజ‌న్‌లో విజేత‌గా నిలిచిన ఇండియా ఛాంపియ‌న్స్ జ‌ట్టు మ‌రోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో డ‌బ్ల్యూసీఎల్ రెండో సీజ‌న్ కోసం సిద్ధ‌మైంది. యువ‌రాజ్ సింగ్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగ‌నుంది. 2024లో అరంగేట్ర ఎడిష‌న్‌లోనూ యువీ సార‌థ్యంలోనే టీమ్ఇండియా విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ENG vs IND : పాపం ర‌వీంద్ర జ‌డేజా.. నీ క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దురా అయ్యా..

సురేశ్ రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్‌, యూస‌ఫ్ ప‌ఠాన్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్ వంటి దిగ్గ‌జాలు ఈ జ‌ట్టులో ఉన్నారు. మొత్తం 16 మందితో కూడిన జాబితాను ప్ర‌క‌టించారు.

డ‌బ్ల్యూసీఎల్ రెండో సీజ‌న్ జూలై 18 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు ఇంగ్లాండ్‌లో జ‌ర‌గ‌నుంది. మొత్తం నాలుగు వేదిక‌లు.. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఆరు జ‌ట్లు భార‌త్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి.

ఈ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ ప‌ద్ద‌తిలో జ‌ర‌గ‌నుంది. ప్ర‌తి జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కో మ్యాచ్ ఆడ‌నుంది. మొద‌టి నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్‌లో క‌ప్పు కోసం త‌ల‌ప‌డ‌తాయి.

ENG vs IND : శుభ్‌మ‌న్ గిల్ 300 మిస్‌.. పంత్‌, భార‌త బ్యాటింగ్ కోచ్ సంబ‌రాలు?

ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇదే..
యువరాజ్ సింగ్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్

భార‌త షెడ్యూల్ ఇదే..

జూలై 20 – పాకిస్తాన్‌తో
జూలై 22 – ద‌క్షిణాఫ్రికాతో
జూలై 26 – ఆస్ట్రేలియాతో
జూలై 27 – ఇంగ్లాండ్‌తో
జూలై 29 – వెస్టిండీస్‌తో