Yuvraj Singh
Yuvraj Singh : ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. యూవీ పోస్ట్ చేసిన వీడియో చాలామంది భారత క్రికెటర్ల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని ఫోటో మాత్రం యూవీ వీడియోలో కనిపించలేదు. దీంతో ధోని అభిమానులు సోషల్ మీడియాలో యూవీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ధోని ఫోటో ఎందుకు పెట్టలేదని ఏకిపారేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ధోని ఫోటో లేకుండా యూవీ వీడియో పోస్టు చేశాడని ధోని ఫాన్స్ మండిపడుతున్నారు. నిజానికి ధోనితో యువీకి ప్రత్యేక అనుబంధం ఉంది.
2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో విజయం సాదించగానే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన యువీ ధోనీని గట్టిగా హత్తుకున్న మూమెంట్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్ మరచిపోలేరు. అలాంటిది ఫ్రెండ్‌షిప్‌డే వీడియోలో ధోనీ లేకపోవడం ఏంటని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
To a lifetime of friendship ❤️? #HappyFriendshipDay pic.twitter.com/apGx5sL2iN
— Yuvraj Singh (@YUVSTRONG12) August 1, 2021