Yuzvendra Chahal joins IPL training wants new batting position at Punjab Kings
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగియడంతో స్టార్ ఆటగాళ్ల ఒక్కొక్కరుగా ఐపీఎల్ జట్లలలో చేరుతున్నారు. ఇక స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం ఐపీఎల్2025 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు చాహల్ ఆడాడు. వేలానికి ముందు అతడిని ఆర్ఆర్ విడిచిపెట్టింది. మెగా వేలంలో చాహల్ జాక్‌పాట్ కొట్టాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18 కోట్లు పెట్టి మరీ కొంది. తాజాగా అతడు పంజాబ్ శిబిరంలో చేరాడు. ఇక ఎప్పటిలాగానే తన హస్యంతో ఆటగాళ్లతో పాటు అభిమానులను నవ్వించాడు.
Hardik Pandya : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక్క ఫోటోతో..
&
బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ సెషన్‌లో పంజాబ్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఒకవేళ జట్టుకు ఓపెనర్ అవసరం అనుకుంటే తనను పరిగణలోకి తీసుకోవాలని అన్నాడు.
రికీ.. ఓపెనింగ్ స్లాట్ ఏమైనా ఖాళీగా ఉందా? అని క్యాప్షన్ పెట్టి వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చాహల్ ప్రాక్టీస్‌కు వెలుతూ.. పాంటింగ్‌ను బ్యాటింగ్ ఆర్డర్ గురించి అడిగాడు. ఆ తరువాత నెట్స్‌లో చాహల్ తన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు.
కాగా.. చాహల్ ఇప్పటి వరకు 160 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 205 వికెట్లు తీశాడు. 5 వికెట్ల ప్రదర్శన ఓ సారి చేయగా, ఆరు సార్లు 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. అత్యుత్తమ ప్రదర్శన 5/40గా ఉంది. ఇక చాహర్ పెద్దగా బ్యాటింగ్ చేయడు అన్న సంగతి తెలిసిందే. ఆఖరి బ్యాటర్‌గా క్రీజులోకి వస్తుంటాడు. ఐపీఎల్‌లో అతడికి 20 ఇన్నింగ్స్‌ల్లోనే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. మొత్తం 37 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 8 నాటౌట్.
ఆ ముగ్గురి కోసం.. పాంటింగ్
మెగా వేలంలో ఓ ముగ్గరు ఆటగాళ్లను పంజాబ్ జట్టులోకి ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకున్నట్లు ఓ సందర్భంలో పాంటింగ్ చెప్పాడు. ‘నేను ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవాలని అనుకున్నాను. అందులో నాలుగేళ్లుగా జట్టులో ఉన్న అర్ష్‌దీప్ సింగ్ ఒకడు. గతంలో నేను పని చేసిన, కెప్టెన్‌గా ఎక్కువ విజయాలను అందించిన శ్రేయస్ అయ్యర్. ఇంకొకరు చాహల్.’ అని పాంటింగ్ తెలిపాడు. అదృష్టవశాత్తు ఈ ముగ్గరిని మెగా వేలంలో కొనుగోలు చేయడంతో జట్టు సమతూకంతో ఉన్నట్లుగా భావిస్తున్నట్లు పాంటింగ్ అన్నాడు.