Hardik Pandya : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక్క ఫోటోతో..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

Hardik photograph with 2025 Champions Trophy breaks Kohli huge social media record Reports
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమ్ఇండియా నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9న) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ చేరినప్పటికి ఫైనల్ మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిపోయింది.
నాటి ఫైనల్ మ్యాచ్‌లో హార్ధిక్ కూడా జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. కాగా.. కప్ అందుకున్న తరువాత భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి.
HARDIK PANDYA – THE FASTEST INDIAN TO HIT 1M LIKE ON INSTRAGRAM. 🤯
– 1M Like In just 6 minutes….!!!! 🔥 pic.twitter.com/llCQGK8XJ4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2025
ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఛాంపియన్స్ ట్రోఫీతో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తరువాత కప్పుతో హార్దిక్ ఎలా ఫోజు ఇచ్చాడో.. సరిగ్గా ఛాంపియన్స్ ట్రోఫీతోనూ అలాంటి ఫోజే ఇచ్చాడు.
ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్‌లను సాధించిన భారతీయుడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.
2024 టీ20 ప్రపంచకప్ అనంతరం.. ఆ కప్పుతో ఫోటో దిగిన కోహ్లీ దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా కేవలం ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్‌లు వచ్చాయి. ఇప్పుడు హార్దిక్ పోస్ట్ చేసిన ఫోటోకి కేవలం ఆరు నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటో 1.66 కోట్లకు పైగా లైక్‌లను సాధించింది.