×
Ad

ZIM vs AFG : అఫ్గానిస్తాన్‌కు భారీ షాక్.. ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ 73 ప‌రుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే..

అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే (ZIM vs AFG) ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

Zimbabwe won by an innings and 73 runs against Afghanistan One off Test

ZIM vs AFG : అఫ్గానిస్తాన్‌కు జింబాబ్వే షాకిచ్చింది. స్వ‌దేశంలో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే (ZIM vs AFG) ఘ‌న విజ‌యం సాధించింది. అఫ్గానిస్తాన్ పై ఇన్నింగ్స్ 73 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 127 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (37), అబ్దుల్ మాలిక్ (30) లు ప‌ర్వాలేద‌నిపించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్రాడ్ ఎవాన్స్ ఐదు వికెట్లు తీశాడు. ముజారబానీ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

WPL auction 2026 : న‌వంబ‌ర్ 26 లేదా 27 తేదీల్లో డ‌బ్ల్యూపీఎల్ 2026 వేలం..! ఎంత మందిని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోవ‌చ్చంటే..?

ఆ త‌రువాత బెన్ కర్రాన్ (121) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 359 ప‌రుగులు చేసింది. సికందర్ రాజా (65), నిక్ వెల్చ్ (49) లు రాణించారు. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో జియావుర్ రెహమాన్ షరీఫీ ఏడు వికెట్లు సాధించాడు. జింబాబ్వేకు 232 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

Virat Kohli : ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై విరాట్ కోహ్లీ క‌న్ను..

232 లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన అఫ్గానిస్తాన్ 159 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో ఇబ్రహీం జద్రాన్ (42), బహిర్ షా (32) లు ప‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన వారు దారుణంగా విఫ‌లం కావ‌డంతో అఫ్గాన్‌కు ఇన్నింగ్స్ ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన జింబాబ్వే ఆటగాడు బెన్‌ కర్రన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ద‌క్కింది.