Virat Kohli : ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై విరాట్ కోహ్లీ కన్ను..
ఆసీస్‌తో రెండో వన్డేకి ముందు విరాట్ కోహ్లీని (Virat Kohli) పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

IND vs AUS 2nd ODI Virat Kohli need 54 rusn to surpass Kumar Sangakkara ODI runs
Virat Kohli : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం (అక్టోబర్ 23) భారత్, ఆస్ట్రేలియా జట్ల మద్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం 0-1తో వెనుకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
సంగక్కర రికార్డు బ్రేక్..?
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 54 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ఇప్పటి వరకు కోహ్లీ 303 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 291 ఇన్నింగ్స్‌ల్లో 14181 పరుగులు సాధించాడు. ఇక సంగక్కర 404 మ్యాచ్‌ల్లో 14,234 పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 463 మ్యాచ్‌ల్లో 18426 పరగులు సాధించాడు.
IND vs AUS : ఆసీస్‌తో రెండో వన్డే.. అడిలైడ్‌లో రోహిత్ రికార్డు అలా, కోహ్లీ రికార్డు ఇలా..
సెంచరీ చేస్తే..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు చేశాడు. కోహ్లీ వన్డేల్లో ఇప్పటి వరకు 51 శతకాలు బాదాడు. ఆసీస్‌తో రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. వన్డేల్లో 52 శతకాలతో.. ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతాడు.
తొలి మ్యాచ్‌లో డకౌట్..
దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కోహ్లీ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అయితే.. రెండో వన్డే ఆతిథ్యం ఇస్తున్న అడిలైడ్‌లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లో రెండు సెంచరీల సాయంతో 244 పరుగులు చేశాడు.