IND vs AUS : ఆసీస్‌తో రెండో వన్డే.. అడిలైడ్‌లో రోహిత్ రికార్డు అలా, కోహ్లీ రికార్డు ఇలా..
రెండో వన్డేకు (IND vs AUS) ఆతిథ్యం ఇస్తున్న అడిలైడ్ మైదానంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు ఇలా ఉన్నాయి.

IND vs AUS 2nd odi kohli and rohit odi records at adelaide oval
IND vs AUS : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడి పోయింది. ఈ నేపథ్యంలో సిరీస్‌లో నిలబడి, సమం చేయాలంటే భారత్‌కు రెండో వన్డేలో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా గురువారం భారత్, ఆసీస్ (IND vs AUS ) జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
తొలి వన్డేలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలం అయిన సంగతి తెలిసిందే. కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ 8 పరుగులే చేశాడు. దీంతో అడిలైడ్‌లో వీరిద్దరు ఎలా ఆడతాడు అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
రెండో వన్డేకు ఆతిథ్యం ఇస్తున్న అడిలైడ్ మైదానంలో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 12 మ్యాచ్‌లు ఆడాడు. 65 సగటుతో 975 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 141.
ఇక వన్డేల విషయానికి వస్తే.. ఇక్కడ కోహ్లీ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 61 సగటుతో 244 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.
రోహిత్‌కు అచ్చిరాలేదు..
కాగా.. ఈ మైదానంలో రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు లేదు. ఇప్పటి వరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన హిట్‌మ్యాన్ 21.83 సగటుతో 131 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 43.