Rohit Sharma : తనను తొలగించి గిల్‌కు కెప్టెన్సీ.. అందుకనే తొలి వన్డేలో రోహిత్ శర్మ సరిగ్గా ఆడలేదా?
ఆసీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma ) విఫలం అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో..

Sunil Gavaskar speaks on notion that Sharma might underperform deliberately to hurt new captain Gill
Rohit Sharma : తనను కెప్టెన్సీ నుంచి తొలగించడం, శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతోనే పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సరిగ్గా ఆడలేదనే రూమర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు హిట్‌మ్యాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా.. వీటిపై తాజాగా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ను స్పందించాడు. ఎవరూ కావాలనే విఫలం కారు అని చెప్పుకొచ్చాడు.
గత కొన్ని సంవత్సరాలు భారత్ క్రికెట్ ఫ్యాన్స్‌లో ఓ అపోహ ఉందన్నాడు. ఎవరైనా ఆటగాడు కెప్టెన్సీ కోల్పోయి అతడి స్థానంలో మరో ప్లేయర్ ఆ బాధ్యతలు చేపడితే.. కొత్త కెప్టెన్ సారథ్యంలో పాత కెప్టెన్ సరిగ్గా ఆడడరని అనుకుంటూ ఉంటారన్నాడు.
‘పాత కెప్టెన్ తన శక్తి సామర్థ్యాల మేరకు ఆడకుండా కొత్త కెప్టెన్‌ను ఇబ్బంది పెడతారని అంటూ ఉంటారు. నిజానికి ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సరిగ్గా ఆడకుంటే జట్టు నుంచి తీసివేస్తారనే విషయం పాత కెప్టెన్‌కు తెలుసునని అన్నాడు. కాబట్టి కెప్టెన్సీ పోయినందుకు ఎంత బాధపడినప్పటికి కూడా ఏ ఆటగాడు కావాలని మాత్రం విఫలం కాడు.’ అని గవాస్కర్ అన్నాడు.
ఆ ఇద్దరి వల్ల గిల్‌కే ఎక్కువ లాభం..
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీలను యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హ్యాండిల్ చేయగలడా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దీనిపైనా గవాస్కర్ స్పందించాడు. దీనిపై శుభ్‌మన్ గిల్ ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందే మాట్లాడాడని గుర్తు చేసుకున్నాడు. తాను కెప్టెన్ అయినా సరే రో-కో ద్వయంతో తన సంబంధాలలో ఎలాంటి మార్పు లేదని గిల్ చెప్పాడని అన్నారు.
ఇక రోహిత్, కోహ్లీ లు జట్టులో ఉండడం వల్ల గిల్‌కే ఎక్కువ లాభం అని చెప్పుకొచ్చాడు. రోహిత్, కోహ్లీలు అత్యుత్తమ వన్డే ప్లేయర్లు అని, అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడని తెలిపాడు.