Virat Kohli : రెండో వన్డేకి ముందు కోహ్లీకి ఆసీస్ బ్యాటర్ వార్నింగ్.. కాస్కో.. మళ్లీ అలాగే ఔట్ చేస్తాం..
రెండో వన్డేకి ముందు విరాట్ కోహ్లీ( Virat Kohli )కి ఆసీస్ బ్యాటర్ వార్నింగ్ ఇచ్చాడు.

Virat Kohli Sent Big Warning By Matt Short Ahead Of 2nd ODI
Virat Kohli : దాదాపు ఏడు నెలల తరువాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే నిష్ర్కమించాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని ఛేజ్ చేస్తూ కోహ్లీ (Virat Kohli) ఔట్ అయ్యాడు. ఇది కోహ్లీ వీక్‌నెస్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కొన్నాళ్ల పాటు ఈ విధమైన డెలివరీలకు కోహ్లీ ఔటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. ఈ తప్పును సరిదిద్దుకుని రాణించిన అతడు మరోసారి తన బలహీనతను బయటపెడుతూ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇలాంటి బంతికే ఔట్ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే రెండో వన్డేలోనూ ఇలాంటి బంతులతోనే అతడిని ఔట్ చేస్తామని ఆసీస్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ తెలిపాడు.
IND vs AUS : పెర్త్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం.. వింత సాకు చెప్పిన బ్యాటింగ్ కోచ్..
రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ మాథ్యూ షార్ట్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆసీస్ బౌలర్లు కోహ్లీ బలహీనతను ఉపయోగించుకుంటారనే విషయాన్ని వివరించాడు. తాను పేసర్ల సమావేశంలో పాల్గొన లేదని, అయినప్పటికి కోహ్లీ అదే రీతిలో ఔట్ కావడం కనిపిస్తుందన్నాడు.
హాజిల్‌వుడ్, స్టార్క్ వంటి పేసర్లు కోహ్లీ బలహీనతలను చక్కగా ఉపయోగించుకుంటారని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయినప్పటికి కోహ్లీకి ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసన్నాడు.
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ ఔట్.. ఫైనల్ ఇక భారత్‌లోనే..
టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటే లక్ష్యంగా ప్రస్తుతం అతడు ఆడుతున్నాడు. అయితే అది అంత సులభం కాదు. ఆసీస్‌తో సిరీస్‌లో రాణిస్తేనే తదుపరి వన్డే సిరీస్‌లలో కోహ్లీకి చోటు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో విఫలం అయిన అతడు మిగిలిన రెండు వన్డేల్లో తప్పక రాణించాల్సి ఉంటుంది.