IND vs AUS : పెర్త్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం.. వింత సాకు చెప్పిన బ్యాటింగ్ కోచ్..
ఆసీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs AUS ) సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలం అయ్యారు.

Sitanshu Kotak Strange Excuse For Virat Kohli, Rohit Sharma Flop Show
IND vs AUS : భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ 8 పరుగులు మాత్రమే చేశాడు. దాదాపు ఏడు నెలల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రో-కో ద్వయం విఫలం కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో సీనియర్లు రోహిత్, కోహ్లీలను బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెనకేసుకొచ్చాడు. వాతావరణం కారణంగానే వారిద్దరు విఫలం అయ్యారని చెప్పాడు. వర్షం ఆటకు చాలా సార్లు అంతరాయాలు కలిగించిందనేది నిజమే అయినప్పటికీ.. వారి ఆట ప్రభావితం అయ్యేంతగా వారిద్దరు ఎక్కువ సేపు క్రీజులో లేరు అన్నది కూడా గమనించాల్సిన విషయం.
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ ఔట్.. ఫైనల్ ఇక భారత్‌లోనే..
రెండో వన్డేకు ముందు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. రోహిత్ శర్మ, కోహ్లీ విషయంలో ఎలాంటి ఆందోళన లేదన్నాడు. వారు ఆటకు దూరం అయ్యారని అనుకోవడం లేదన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత ఆ ఇద్దరు ఐపీఎల్ ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఇక ఆసీస్‌తో సిరీస్ (IND vs AUS )కోసం చాలా బాగా సన్నద్ధం అయ్యారని చెప్పుకొచ్చాడు. తొలి వన్డేకు వరుణుడు చాలా సార్లు అంతరాయం కలిగించాడు. వాతావరణం వల్ల ఆటపై ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు కూడా మొదట బ్యాటింగ్ చేసినా ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నాడు.
Parvez Rasool : రిటైర్‌మెంట్ ప్రకటించిన 36 ఏళ్ల టీమ్ఇండియా ఆల్‌రౌండర్..
‘ఇన్నింగ్స్‌కు నాలుగైదు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. సీనియర్లు ప్లేయర్లకు ఎంతో అనుభవం ఉంది. ఆసీస్‌కు రాక ముందు వారిద్దరు గొప్పగా ప్రాక్టీస్ చేశారు. ఒక్క ఇన్నింగ్స్‌లో విఫలం అయినంత మాత్రాన వారిద్దరిని జడ్జ్ చేయాల్సిన పని లేదు. ఫిట్‌నెస్ బాగుంది. లయలోనే ఉన్నారు. నెట్స్‌లో బాగానే ఆడుతున్నారు. రెండో వన్డేలో పరుగులు సాధిస్తారని అనుకుంటున్నా.’ అని కోటక్ అన్నాడు.