IND vs AUS 2nd odi kohli and rohit odi records at adelaide oval
IND vs AUS : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడి పోయింది. ఈ నేపథ్యంలో సిరీస్‌లో నిలబడి, సమం చేయాలంటే భారత్‌కు రెండో వన్డేలో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా గురువారం భారత్, ఆసీస్ (IND vs AUS ) జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
తొలి వన్డేలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలం అయిన సంగతి తెలిసిందే. కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ 8 పరుగులే చేశాడు. దీంతో అడిలైడ్‌లో వీరిద్దరు ఎలా ఆడతాడు అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
రెండో వన్డేకు ఆతిథ్యం ఇస్తున్న అడిలైడ్ మైదానంలో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 12 మ్యాచ్‌లు ఆడాడు. 65 సగటుతో 975 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 141.
ఇక వన్డేల విషయానికి వస్తే.. ఇక్కడ కోహ్లీ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 61 సగటుతో 244 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.
రోహిత్‌కు అచ్చిరాలేదు..
కాగా.. ఈ మైదానంలో రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు లేదు. ఇప్పటి వరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన హిట్‌మ్యాన్ 21.83 సగటుతో 131 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 43.