2024 BMW M4 CS Launched In India At Rs 1.89 Crore
2024 BMW M4 CS Launch : దేశంలోనే మొట్టమొదటి సీఎస్ మోడల్‌గా బీఎండబ్ల్యూ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త M4 CS కారును లాంచ్ చేసింది. ఈ సరికొత్త బీఎండబ్ల్యూ ఎమ్4 సీఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.89 కోట్లు ఉంటుంది. ఈ కారు దేశంలో పూర్తిగా బిల్ట్-అప్ (CBU) మోడల్‌గా అందుబాటులో ఉంటుంది. బీఎండబ్ల్యూ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో బుక్ చేసుకోవచ్చు.
బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ సీఈఓవిక్రమ్ పవాహ్ మాట్లాడుతూ.. “బీఎండబ్ల్యూ నుంచి ఎమ్ విభాగం ఎల్లప్పుడూ పర్ఫార్మెన్స్ ఆధారిత ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. సరికొత్త బీఎండబ్ల్యూ ఎమ్4 సీఎస్ ఎమ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. మోటారు రేసింగ్ డీఎన్ఏతో పాటుగా ప్రత్యేకమైన స్పోర్టి క్యారెక్టర్‌ని అందజేసే ఎడిషన్ మోడల్‌లు అన్‌లిమిటెడ్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఎమ్ ఎక్స్‌డ్రైవ్‌తో సిద్ధంగా ఉన్న బీఎండబ్ల్యూ ఎమ్4 సీఎస్ పూర్తిగా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.
ఐకానిక్ డిజైన్, మరెన్నో అప్‌గ్రేడ్ ఆప్షన్లు :
సరికొత్త బీఎండబ్ల్యూ ఎమ్4 సీఎస్ ప్రత్యేకమైన డిజైన్ ఫీచర్లలో రెడ్ కాంటౌర్ లైన్‌లు, రెండు సమాంతర గ్రిల్ బార్‌ల పైభాగంలో “ఎమ్4 సీఎస్” బ్యాడ్జింగ్ ఉన్నాయి. ఎల్లో కలర్ పగటిపూట రన్నింగ్ లైట్ ఐకాన్‌లతో రీడిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు జీటీ రేస్ కార్లను గుర్తుకు తెస్తాయి. ఆకర్షణీయమైన బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్‌తో పాటు, బీఎండబ్ల్యూ ఎమ్4 సీఎస్ ఫ్రంట్ సైడ్ కలిగి ఉంది.
బ్యాక్ సైడ్ గర్నీ-స్టయిల్ స్పాయిలర్, ఒక సీఎఫ్‌ఆర్పీ డిఫ్యూజర్, 4 టెయిల్‌పైప్‌లతో కూడిన టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్ కలిగి ఉంది. అత్యంత కచ్చితమైన సీఎస్ఎల్ స్టైల్ లేజర్ టెయిల్ లైట్లు ప్రామాణిక డివైజ్‌లో భాగమని చెప్పవచ్చు. తేలికపాటి వీల్స్ (ముందువరుసలో 19-అంగుళాలు, బ్యాక్ సైడ్ 20-అంగుళాలు) ప్రామాణికంగా అమర్చి ఉంటాయి.
గంటకు 302కి.మీ టాప్ స్పీడ్ :
స్పెషల్-ఎడిషన్ మోడల్ రెడ్ కలర్ పెయింట్ చేసిన కాలిపర్‌లతో ఎమ్ కాంపౌండ్ బ్రేక్‌లతో అమర్చారు. ఎమ్ కార్బన్ సిరామిక్ బ్రేకింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎమ్ ఫ్రంట్-ఎండ్ స్ట్రట్ బ్రేస్‌ను పొందుతుంది. ఎమ్ ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో కూడిన హై రిస్టోర్ 3.0L సిక్స్-సిలిండర్ ఇన్-లైన్ ఇంజన్ కూడా ఇంటెలిజెంట్ ఫోర్-వీల్ డ్రైవ్ ఎమ్ ఎక్స్‌డ్రైవ్‌తో వస్తుంది.
ఈ ఇంజన్ గరిష్టంగా 550హెచ్‌పీ అవుట్‌పుట్, 650ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను గంటకు 0 నుంచి 100కిలోమీటర్ల యాక్సిలరేషన్‌తో కేవలం 3.4 సెకన్లలో ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యేక ఎడిషన్ అత్యధిక వేగం, ఎమ్ డ్రైవర్స్ ప్యాకేజీతో ప్రామాణికంగా వస్తుంది. ఎలక్ట్రానిక్‌గా గంటకు 302 కిలోమీటర్లు (188mph)కి పరిమితం చేస్తుంది. గేర్‌బాక్స్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ సస్పెన్షన్, అడాప్టివ్ సస్పెన్షన్ కూడా ఉంది.
అత్యాధునిక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
కారులో లోపల ఎమ్4 సీఎస్ బీఎండబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్‌తో కలిపి బీఎండబ్ల్యూ హెడ్-అప్ డిస్‌ప్లేను అమర్చారు. అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టమ్ రీడిజైన్ చేసిన ఎంట్రీ స్క్రీన్, యూజర్ ఎలక్ట్రానిక్స్ డివైజ్‌ల కోసం మెను “క్విక్‌సెలెక్ట్” యాక్సెస్‌ను అందిస్తుంది. బీఎం డబ్ల్యూ కనెక్టెట్ డ్రైవ్ టెక్నాలజీలతో వైర్‌లెస్ ఛార్జింగ్, టెలిఫోనీ, హెడ్-అప్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, యాక్టివ్ ప్రొటెక్షన్‌తో పాటు పార్కింగ్ వే కంట్రోలింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఫ్రంట్, బ్యాక్ సెన్సార్‌లతో పాటు పార్కింగ్ అసిస్టెంట్ సపోర్టు చేస్తుంది. హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా అందిస్తుంది.