137వజ్రాలతో రూ.71లక్షల iPhone చూశారా..

ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీనిని కొనాలనుకోవడం కంటే చూడాలనుకుంటేనే సంతృప్తి మిగులుతుంది. ఎందుకంటే ఇది అక్షరాలా లక్ష అమెరికన్ డాలర్లు(రూ.71లక్షలు). Caviar Solarius Zenith Full Gold iPhone 11 Pro మోడల్ ఫోన్‌ను అత్యంత ఖరీదైన ఫోన్‌గా మార్చేశారు. 

వెనుక ఉండే గ్లాస్‌ను తొలగించి గడియారంలా ఉండే డిజైన్‌తో 24క్యారెట్ల ప్లేట్‌ను అమర్చారు. అందులో బంగారంతో పాటు 137వజ్రాలను పొదిగారు. నలుపు, బంగారం రంగులో ఫోన్ బాక్స్ ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే మెరుస్తున్న ఐఫోన్ బ్యాక్ ప్యానెల్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఓ ఫాస్ట్ ఛార్జర్, మెరుస్తున్న కేబుల్, గోల్డ్ ప్లేటెడ్ స్లిమ్ కార్డ్, ఎయిర్‌పాడ్స్ ప్రో ఉంటాయి. 

ఇక ఫీచర్ల జోలికి వెళ్తే ఇది కేవలం ఐఫోన్ 11ప్రో మాత్రమే. బ్యాక్ కవర్ ను మార్చి హంగులతో అద్దారు. కానీ, ఫోన్‌ ఫీచర్‌లో ఎటువంటి మార్పులు లేవు.