Best Camera Phones
Best Camera Phones 2025 : మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. 2025లో బడ్జెట్ ఫ్రెండ్లీగా వివో X300కి గట్టి పోటీనిచ్చే స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. అందులో గూగుల్ పిక్సెల్ 9a, వన్‌ప్లస్ 13s, ఒప్పో రెనో 14 ప్రో, వివో V60, ఒప్పో రెనో 14 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S24 వంటి స్మార్ట్‌ఫోన్లు సరసమైన ధరలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. మీరు కొత్త కెమెరా ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ టాప్ 5 ఫోన్లలో మీకు నచ్చిన బ్రాండ్ మోడల్ కొనేసుకోండి.. వివో X300 కన్నా బెటర్ ఫీచర్లతో మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు..
వివో X300 (రూ.75,999) :
భారత మార్కెట్లో వివో X300, వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్‌లు మీడియాటెక్ కొత్త డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. ఫొటోగ్రఫీ పరంగా ఈ సిరీస్ ప్రో వేరియంట్‌లో గింబాల్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ LYT-828 ప్రైమరీ సెన్సార్ ఉంది. 50MP అల్ట్రావైడ్ లెన్స్, 200MP శాంసంగ్ HPB టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 50MP శాంసంగ్ JN1 సెన్సార్ ఉంది. బ్యాక్ సైడ్ 200MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కూడా 50MP కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 9a (రూ. 44,999) :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 48MP + 13MP, 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా, 23W ఛార్జర్‌తో 5100mAh బ్యాటరీని కలిగి ఉంది.
వన్‌ప్లస్ 13s (రూ. 52,497) :
వన్‌ప్లస్ 13s ఫోన్ డ్యూయల్ 50MP కెమెరా సెటప్ అద్భుతమైన ఫొటోలు తీయొచ్చు. అయితే, 32MP ఫ్రంట్ కెమెరా అందమైన సెల్ఫీలను తీసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 1B కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 1600 నిట్స్ (HBM) బ్రైట్‌నెస్ అందించే 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ 5850mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.
వివో V60 ఫోన్ 50MP+50MP+8MP రియర్ కెమెరా సెటప్‌తో పాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కెమెరా లెన్స్ అడ్వాన్స్ ఇమేజ్ క్వాలిటీ కోసం జైస్ ఆప్టిక్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 90W ఛార్జర్‌తో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో రెనో 14 ప్రో (రూ. 49,999) :
ఒప్పో రెనో 14 ప్రోలో ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 1B కలర్లతో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15పై ColorOS 15తో రన్ అవుతుంది. ఇంకా, 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6200mAh బ్యాటరీని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S24 (రూ. 39,999) :
శాంసంగ్ గెలాక్సీ S24లో 50MP + 10MP + 12MP బ్యాక్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. వన్ యూఐ 8.0 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జర్‌తో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది.