Top Selling e-Scooter 2025 : ఈ e-స్కూటర్ రేంజే వేరబ్బా.. 2025లో ఫ్యామిలీలకు బెస్ట్ చాయిస్‌గా హీరో విడా.. సేల్స్‌తో మార్కెట్ షేక్..!
Top Selling e-Scooter 2025 : హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ఇ-స్కూటర్ల అమ్మకాలలో రికార్డులను సృష్టించింది. ఏడాది చివరిలో లక్షకు పైగా ఎక్కువ విడా యూనిట్లు అమ్ముడయ్యాయి. ధరలు కేవలం రూ. 44,990 మాత్రమే..
Hero Vida Scooter Sales
Top Selling e-Scooter 2025 : భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ కస్టమర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025లో టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల్లో భారీగా అమ్మకాలతో దూసుకెళ్లాయి. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యధిక అమ్మకాలతో టాప్ ప్లేసులో నిలిచింది. ఈ హీరో కంపెనీ ఎట్టకేలకు 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మైలురాయిని సాధించింది.
2025లోవిడా ఇ-స్కూటర్ అమ్మకాలు రికార్డును సృష్టించాయి. క్యాలెండర్ సంవత్సరంలో మొదటిసారిగా లక్ష యూనిట్లను అధిగమించాయి. వాహన పోర్టల్ డేటా ప్రకారం.. జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 5, 2025 మధ్య మొత్తం 100,383 విడా ఇ-స్కూటర్లు వినియోగదారులకు డెలివరీ అయ్యాయి. అక్టోబర్ 2022లో లాంచ్ అయిన విడా బ్రాండ్ 150,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది. పూర్తి వివరాలను వివరంగా ఇప్పుడు చూద్దాం..
హీరో విడా అమ్మకాలు ఎలా పెరిగాయంటే? :
2025 అమ్మకాల ప్రారంభంలో హీరో విడా ఇ-స్కూటర్ కేవలం 1,626 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ, మార్చి నుంచి జూన్ వరకు అమ్మకాలు ప్రతి నెలా 6వేల యూనిట్లను మించిపోయాయి. జూలై 2025లో అమ్మకాలు మొదటిసారిగా 10వేలు యూనిట్లను అధిగమించాయి (10,548 యూనిట్లు). ఆ తర్వాత హీరో విడా వరుసగా 5 నెలల్లో 10వేలకు పైగా క్లబ్‌లో కొనసాగింది.
అక్టోబర్ 2025లోనే అత్యధిక అమ్మకాలు :
అక్టోబర్‌లో హీరో విడా 16,017 యూనిట్ల రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. బ్రాండ్ చరిత్రలోనే అత్యధికం. విడా మార్కెట్ ర్యాంకింగ్స్‌లో కూడా సంచలనం సృష్టించింది. హీరో విడా పెరుగుతున్న అమ్మకాలతో మార్కెట్ ర్యాంకింగ్స్‌లో కూడా సంచలనం సృష్టించాయి. 2025 జనవరిలో 7వ స్థానం, ఫిబ్రవరి 2025లో 6వ స్థానాన్ని దక్కించుకుంది. మార్చి 2025 నుంచి అక్టోబర్ వరకు 5వ స్థానాన్ని దక్కించుకుంది. నవంబర్ 2025లో ఓలా ఎలక్ట్రిక్‌ను అధిగమించి 4వ స్థానాన్ని సాధించింది. విడా ఇప్పుడు వేగంగా భారతీయ ఈవీ మార్కెట్‌లో టాప్ రేంజ్ ప్లేయర్లలో ఒకటిగా మారుతోంది.
కంపెనీ ఫ్యూచర్ మార్చేసిన మోడల్ :
హీరో విడా అమ్మకాలు పెరగడానికి అసలు కారణం.. జూలై 2025లో లాంచ్ అయిన కొత్త VX2 మోడల్. ఈ మోడల్ ఫ్యామిలీ కస్టమర్ల కోసం రూపొందించగా.. విడా అమ్మకాల వృద్ధికి ఇదే అతిపెద్ద కారణంగా చెప్పవచ్చు.
విడాకు VX2 గేమ్-ఛేంజర్? :
హీరో VX2 EV సాధారణ స్కూటర్ మాదిరిగానే ఫ్యామిలీ ఫ్రెండ్లీ డిజైన్ కలిగి ఉంది. డిజైన్ భారతీయ ఫ్యామిలీలను బాగా ఆకట్టుకుంది. BaaS మోడల్ ధర చాలా ఆకర్షణీయంగా ఉంది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) స్కూటర్ ధర భారీగా తగ్గింది. వినియోగదారులు ఈ స్కూటర్ బ్యాటరీ కోసం విడిగా సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. హీరో VX2 భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో కొనుగోలు చేయగల ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా చెప్పవచ్చు.
భారీగా పెరిగిన విడా మార్కెట్ వాటా :
2025 చివరి నాటికి విడా మార్కెట్ వాటా 8శాతానికి పెరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో హీరో దూసుకుపోతుంది. హీరో మోటోకార్ప్ విడా ఇప్పుడు మరిన్ని అమ్మకాల వైపు వేగంగా ముందుకు సాగుతోంది.
నెల (CY2025) అమ్మకాలు
జనవరి : 1,626
ఫిబ్రవరి : 2,696
మార్చి : 8,039
ఏప్రిల్ : 6,150
మే : 7,191
జూన్ : 7,702
జూలై : 10,548
ఆగస్టు : 13,380
సెప్టెంబర్ : 12,830
అక్టోబర్ : 16,017
నవంబర్ : 12,220
డిసెంబర్ (1-5 మాత్రమే) : 1,984
మొత్తం : 1,00,383
