Top Selling Smartwatches 2025 : సరసమైన ధరలో ప్రీమియం ఫీచర్లు.. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్‌వాచ్‌లు ఇవే..!
Top Selling Smartwatches 2025 : సరసమైన ధరలో అద్భుతమైన ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్‌లు ఉన్నాయి. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్‌వాచ్‌లు ఇలా ఉన్నాయి.
Top Selling Smartwatches 2025
Top Selling Smartwatches 2025 : 2025 ఏడాదిలో స్మార్ట్ వాచ్‌లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమకు నచ్చిన బ్రాండ్ మోడల్ బట్టి కొత్త స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేశారు. ఇందులో హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్, జిమ్, జాగింగ్ వంటి అనేక స్మార్ట్ యాక్టివిటీల కోసం వినియోగించుకోవచ్చు.
ప్రస్తుతం రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లు అనేవి కేవలం సమయం చెప్పే గాడ్జెట్ మాత్రమే కాదు. హెల్త్, ఫిట్‌నెస్‌లో ముందంజలో ఉన్నాయి. మీ హార్ట్ రేట్ నుంచి స్లీప్ మానిటరింగ్ వరకు అన్ని ట్రాక్ చేయగలవు. ఇప్పుడు జిమ్, జాగింగ్ లేదా ఇతర డెయిలీ యాక్టివిటీస్‌లో స్మార్ట్‌వాచ్‌లను వినియోగించుకోవచ్చు. 2025లో అత్యంతగా అమ్ముడైన హెల్త్ ట్రాకింగ్ 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను ఓసారి పరిశీలిద్దాం..
ఆపిల్ వాచ్ సిరీస్ 10 :
స్మార్ట్ వేరబుల్ వాచ్‌లలో ఆపిల్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కొత్త వెర్షన్ ఆపిల్ సిరీస్ 10 కచ్చితంగా హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కలిగి ఉంది. ఈ వాచ్ అడ్వాన్స్ ECG ప్లస్ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్‌తో వస్తుంది. మీ గుండె ఆరోగ్యానికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది.
ఏఐ సపోర్టుతో స్లీప్ యానాలిసిస్ కలిగి ఉంది. మీరు ఎలా నిద్రపోతున్నారో చెప్పగలదు. అంతేకాదు.. శరీరంలోని ప్రతి చిన్న మార్పును ట్రాక్ చేసే SpO2 శరీర ఉష్ణోగ్రత సెన్సార్లను కలిగి ఉంది. ఒకవేళ ఈ వాచ్ కింద పడే ముందు కూడా రిక్నగైజేషన్ SOS కలిగి ఉంటుంది. ఐఫోన్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 :
శాంసంగ్ స్మార్ట్‌వాచ్ సిరీస్ హెల్త్ ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 కూడా అద్భుతమైన హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మానిటరింగ్ చేయలదు. డయాబెటిక్ రోగులకు బెటర్ ఆప్షన్.
హృదయ స్పందన రేటుతో పాటు ఆక్సిజన్ మానిటరింగ్, ఇప్పుడు వాచ్‌లో స్ట్రెస్ లెవల్స్ కూడా చూడవచ్చు. ఏఐ రెడీ ఫిట్‌నెస్ కోచ్ ఫీచర్లు కూడా కలిగి ఉంది. ఎలాంటి వ్యాయామాల చేయాలో కూడా గైడెన్స్ ఇస్తుంది. బ్యాటరీ సామర్థ్యం, డిజైన్ కోసం చూస్తున్న స్టయిల్-స్పృహ ఉన్నవారికి అద్భుతమైన ఆప్షన్.
Read Also : 2025 Top Selling Cars : 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే.. ఈ కార్లే కావాలంటూ ఎగబడి కొనేశారు..!
ఫిట్‌బిట్ సెన్స్ 3 :
ఫిట్‌బిట్ హెల్త్ సెంట్రలైజడ్ గాడ్జెట్‌లకు బెస్ట్ స్మార్ట్‌వాచ్. ఈ సెన్స్ వాచ్ గుండె ఆరోగ్యంతో పాటు అలారం సిస్టమ్ వంటి నోటిఫికేషన్‌లను ఇస్తుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే అలర్ట్ చేస్తుంది. స్కిన్ టెంపరేచర్, సెన్సింగ్ డివైజ్‌లతో పాటు రోజంతా మీ మూవెంట్ కేలరీలను ట్రాక్ చేసే యాక్టివిటీ ట్రాకింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అందుకే మానసిక ఆరోగ్యం కోసం ఫిట్‌బిట్ సెన్స్ 3లో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ మైండ్‌ఫుల్‌నెస్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ మిడ్ బడ్జెట్ వాచ్ కోరుకునే వారికి సరిపోతుంది.
నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 4 మ్యాక్స్ :
హెల్త్ ఫీచర్లు కోరుకునే బడ్జెట్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్. ఈ వాచ్ ధర దాదాపు రూ. 5వేలు ఉంటుంది. కానీ, 24 గంటల స్టేబుల్ హార్ట్ రేట్, SpO2 మానిటరింగ్ అందిస్తుంది. స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే స్లీప్ ట్రాకింగ్ క్వాలిటీ, స్ట్రెస్ మానిటరింగ్ కండిషన్స్, రన్నింగ్, యోగా, సైక్లింగ్ వంటి అనేక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా అందిస్తుంది. సరసమైన ధరలో మిడిల్ క్లాస్ వినియోగదారులకు మరింతగా ఆకట్టుకుంటూ బాగా పాపులారిటీ పొందింది.
అమేజ్‌ఫిట్ GTR 5 :
అమేజ్‌ఫిట్ జీటీఆర్ 5 స్మార్ట్ వాచ్ అనేది నిజంగా అద్భుతమైన స్మార్ట్‌వాచ్. అన్ని హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కలిగి ఉంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, బాడీ మూవెంట్ వంటి అనేక హెల్త్-ట్రాకింగ్ సెన్సార్‌లను అందిస్తుంది. అంతేకాదు.. లాంగ్ టైమ్ బ్యాటరీ ద్వారా లాంగ్ డే ఛార్జ్ అందిస్తుంది. ప్రీమియం డిజైన్‌లు ఫిట్‌నెస్‌ను స్టైల్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ వాచ్ ఫిట్‌నెస్ మన్నికతో దాదాపు రూ. 15వేల ధర వద్ద లభిస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లు కేవలం గాడ్జెట్‌లు మాత్రమే కాదు.. లైఫ్ స్టయిల్‌లో కూడా మార్పులు తెస్తాయి. టెక్ ప్రియుల కోసం ప్రీమియం మోడళ్లలో ఆపిల్ వాచ్ సిరీస్ 10, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 ఉన్నాయి. అయితే, నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 4 మ్యాక్స్ సామాన్యులకు సరిపోయే బడ్జెట్ మోడళ్లలో ఒకటి. ఫిట్‌బిట్, అమాజ్‌ఫిట్ కూడా హెల్త్ ట్రాకింగ్‌ను యాక్సెస్ చేస్తాయి. 2025లో స్మార్ట్‌వాచ్‌లను అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 మోడళ్లు ఇవేనని చెప్పవచ్చు.
