2025 Top Selling Cars : 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే.. ఈ కార్లే కావాలంటూ ఎగబడి కొనేశారు..!

2025 Top Selling Cars : 2025లో ఆటో ఇండస్ట్రీ భారీ అమ్మకాలతో అనేక కంపెనీలు ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఇందులో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

2025 Top Selling Cars : 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే.. ఈ కార్లే కావాలంటూ ఎగబడి కొనేశారు..!

2025 Top Selling Cars

Updated On : December 9, 2025 / 2:51 PM IST

2025 Top Selling Cars : 2025 ఏడాది ముగుస్తోంది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఈ ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో హ్యుందాయ్, మారుతి సుజుకి, మహీంద్రా మోడల్ కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో అత్యధిక అమ్మకాలతో ముందంజలో నిలిచాయి.

నెలవారీగా అమ్మకాల్లో హెచ్చుతగ్గుదల ఉన్నప్పటికీ టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో టాప్ 5 జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన కారు ఉందేమో చెక్ చేసుకోండి.

1. హ్యుందాయ్ క్రెటా :
హ్యుందాయ్ క్రెటా (SUV) కాంపాక్ట్ SUV విభాగంలో టాప్ ప్లేసులో నిలిచింది. ప్రముఖ హ్యుందాయ్ క్రెటా మోడల్ స్టైల్, కంఫర్ట్‌తోపాటు 1.5L పెట్రోల్, డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, వైడ్ క్యాబిన్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను కలిగి ఉంది. ధర విషయానికి వస్తే.. ఈ హ్యుందాయ్ క్రెటా రూ.10 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంటుంది.

బాడీ టైప్ : SUV
ఫ్యూయిల్ : పెట్రోల్/డీజిల్
ఇంజిన్ : 1493cc డీజిల్ / 1497cc పెట్రోల్
మైలేజ్ : 17 నుంచి 21.4 కి.మీ/లీ
సీటింగ్ సామర్థ్యం : 5
ప్రారంభ ధర : రూ. 10 లక్షల నుంచి

2. మారుతి సుజుకి డిజైర్ :
మారుతి సుజుకి డిజైర్ (సెడాన్) కారు ఇంధన సామర్థ్యం, డబ్బుకు తగిన విలువకు అందించే మోడల్.. ఈ మారుతి డిజైర్ 1.2L కారులో పెట్రోల్ ఇంజిన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ధర రూ. 7 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఉంటుంది.

బాడీ టైప్ : సెడాన్
ఫ్యూయిల్ : పెట్రోల్ / సీఎన్‌జీ
ఇంజిన్ : 1197cc
మైలేజ్ : 24.12 కి.మీ/లీ (పెట్రోల్), 33.12 కి.మీ/కేజీ (CNG)
సీటింగ్ సామర్థ్యం : 5
ప్రారంభ ధర : రూ. 7 లక్షల నుంచి

3. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా :

2025లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (SUV) పాపులర్ సబ్-4 మీటర్ SUV కారుగా నిలిచింది. మారుతి విటారా బ్రెజ్జా 1.5L పెట్రోల్ ఇంజిన్, అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లు, హై సేఫ్టీ స్టాండర్స్ అందిస్తుంది. ఈ కారు ధర విషయానికి వస్తే.. సుమారు రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుంది.

బాడీ టైప్ : SUV
ఫ్యూయిల్ : పెట్రోల్ / సీఎన్‌జీ
ఇంజిన్ : 1462cc
మైలేజ్ : 22.15 కి.మీ/లీ (పెట్రోల్), 25.51 కి.మీ/కేజీ (CNG)
సీటింగ్ సామర్థ్యం : 5
ధర : రూ. 9 లక్షల నుంచి

Read Also : Upcoming Electric SUVs 2026 : టాటా సియెర్రా EV టు కియా సిరోస్ EV.. 2026లో మార్కెట్ షేక్ చేయనున్న టాప్ 5 పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్లు!

4. మారుతి సుజుకి ఎర్టిగా :
మారుతి సుజుకి ఎర్టిగా (MUV) కారు 1.5L పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో వైడ్ రేంజ్ MPV, ఎర్టిగా ఫ్యామిలీలకు సరైనదిగా చెప్పొచ్చు. ఈ కారులో 7 సీట్లతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ ఎర్టిగా ధర విషయానికి వస్తే.. రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల పోటీ ధరను అందిస్తుంది.

బాడీ టైప్ : MUV
ఫ్యూయిల్ : పెట్రోల్, సీఎన్‌జీ
ఇంజిన్ : 1462cc
మైలేజ్ : 20.51 కి.మీ/లీ (పెట్రోల్), 26.11 కి.మీ/కేజీ (CNG)
సీటింగ్ సామర్థ్యం : 7
ధర : రూ. 9 లక్షల నుంచి

5. మహీంద్రా స్కార్పియో/ స్కార్పియో-N :
మహీంద్రా స్కార్పియో, స్కార్పియో-ఎన్ (SUV) అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ కొత్త స్కార్పియో-N వేరియంట్ కఠినమైన భూభాగాల కోసం తయారైంది. పవర్‌ఫుల్ ఇంజిన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంటుంది.

బాడీ టైప్ : SUV
ఫ్యూయిల్ : డీజిల్, పెట్రోల్
ఇంజిన్ : 2184CC
మైలేజ్ : 15 కి.మీ/లీ.
సీటింగ్ సామర్థ్యం: 7 సీట్లు
ధర : రూ. 12.60 లక్షల నుంచి