×
Ad

Best Camera Phones : ఈ కెమెరా ఫోన్లు వేరే లెవల్.. వివో X300 ప్రో కన్నా 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ప్రతి షాట్ మిరాకిల్..!

Best Camera Phones : వివో X300 ప్రో కన్నా బెస్ట్ కెమెరా ఫోన్లు మార్కెట్లో ఏమున్నాయో తెలుసా? ఈ 5 కెమెరా ఫోన్లపై ఓసారి లుక్కేయండి.. ఏది కావాలో కొనేసుకోండి.

Best Camera Phones (Image Credit To Original Source)

  • ఫొటోగ్రఫీ ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు
  • 2026లో వివో X300 ప్రో కన్నా 5 బెస్ట్ కెమెరా ఫోన్లు
  • ఐఫోన్ 17 ప్రో నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వన్‌ప్లస్ 15
  • ఇతర ఫోన్లకు పోటీగా సినిమాటిక్ అవుట్‌పుట్‌

Best Camera Phones : 2026లో కొత్త కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ఏ ఫోన్ కొనాలో అర్థం కావడం లేదా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుతం వివో X300 ప్రో కన్నా ఖతర్నాక్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లో బోలెడు ఉన్నాయి.

అందులో ఐఫోన్ 17 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, గూగుల్ పిక్సెల్ 10 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో, వన్‌ప్లస్ 15తో సహా 5 కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి. 200MP కెమెరాలు, పెరిస్కోప్ జూమ్ నుంచి 8K వీడియో, డాల్బీ విజన్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇమేజింగ్, వీడియో పర్ఫార్మెన్స్, క్రియేటర్-గ్రేడ్ కెమెరా ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

వివో X300 ప్రోలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నప్పటికీ ఇతర అనేక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా అంతే స్థాయిలో ఫీచర్లు ఉన్నాయి. అందులో వీడియో టూల్స్, స్మార్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్, సుపీరియర్ జూమ్ వంటి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఐఫోన్‌ల నుంచి ఫొటోగ్రఫీ ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌ల వరకు ఈ ఏడాదిలో వివో X300 ప్రో కన్నా అదిరిపోయే 5 కెమెరా ఫోన్లు ఏంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ 17 ప్రో (రూ. 1,24,900) :
వీడియో క్రియేటర్లకు ఐఫోన్ 17 ప్రో బెటర్ ఆప్షన్. ఈ ఐఫోన్ ట్రిపుల్ 48MP కెమెరా సిస్టమ్ వైడ్, అల్ట్రావైడ్ 4x పెరిస్కోప్ జూమ్‌ అందిస్తుంది. LiDAR సపోర్టు కూడా ఉంది. ProRes RAW, 120fps వరకు డాల్బీ విజన్ HDR స్పేషియల్ వీడియో రికార్డింగ్‌ అందిస్తుంది. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా సినిమాటిక్ అవుట్‌పుట్‌ అందిస్తుంది.

Best Camera Phones (Image Credit To Original Source)

ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999) :
ఒప్పో ఫైండ్ X9 ప్రో అనేది ఫొటోగ్రఫీ ప్రియులకు అద్భుతంగా ఉంటుంది. 50MP OIS మెయిన్ సెన్సార్‌, భారీ 200MP పెరిస్కోప్ జూమ్ లెన్స్, అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్, లేజర్ AF, LOG రికార్డింగ్ డాల్బీ విజన్ సపోర్టు అందిస్తుంది. వివో X300 ప్రోకి బదులుగా కెమెరా ఫోన్‌ తీసుకోవాలనుకుంటే ఒప్పో ఫైండ్ X9 బెస్ట్ ఆప్షన్.

Read Also : Tata Safari Launch : కొంటే ఇలాంటి కారు కొనాలి.. 5-స్టార్ రేటింగ్‌‌తో టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్‌.. ఫ్యామిలీ కస్టమర్లకు ఫుల్ సేఫ్టీ..!

గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో 50MP మెయిన్ కెమెరా, 48MP 5x పెరిస్కోప్, 48MP అల్ట్రావైడ్ వర్క్ గూగుల్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీతో అందిస్తుంది. అద్భుతమైన డైనమిక్ రేంజ్, లైఫ్‌లైక్ కలర్ ఆప్షన్లు, 42MP 4K సెల్ఫీ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. వివో X300 ప్రో మాదిరిగా పిక్సెల్ 10ప్రోలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,08,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP మెయిన్ కెమెరా, 5x పెరిస్కోప్ జూమ్, డెడికేటెడ్ 3x టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 8K వీడియో, HDR10+ శాంసంగ్ అడ్వాన్స్ ప్రాసెసింగ్‌ ద్వారా జూమ్ డైనమిక్ రేంజ్ అడ్వాన్స్ కెమెరా ఫోన్‌ కూడా ఉంది. వివో X300 ప్రో కన్నా అద్భుతంగా ఉంటుంది.

వన్‌ప్లస్ 15 (రూ. 72,980):
వన్‌ప్లస్ 15 ఫోన్ సోనీ IMX906 సెన్సార్, ట్రిపుల్ 50MP సెటప్‌తో వస్తుంది. 3.5x ఆప్టికల్ జూమ్, 8K వీడియో, డాల్బీ విజన్ అడ్వాన్స్ సపోర్టు ఇస్తుంది. 32MP సెల్ఫీ కెమెరాతో వివో X300 ప్రో కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.