×
Ad

Best OnePlus Phones : కొంటే వన్‌ప్లస్ ఫోన్ కొనాలి.. రూ.40 వేల లోపు ధరలో 5 బెస్ట్ వన్‌ప్లస్ ఫోన్లు.. ఫీచర్లు కిర్రాక్ అంతే..

Best OnePlus Phones : వన్‌ప్లస్ ఫోన్లు కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే. రూ. 40వేల లోపు 5 బెస్ట్ వన్‌ప్లస్ ఫోన్లను కొనేసుకోవచ్చు. ఇందులో మీకు ఏది నచ్చిందో ఎంచుకోండి.

Best OnePlus Phones (Image Credit to Original Source)

  • కొత్త ఏడాదిలో 5 బెస్ట్ వన్‌ప్లస్ ఫోన్లు మీకోసం
  • రూ. 40వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లు
  • లాంగ్ బ్యాటరీ లైఫ్, సింగిల్ ఛార్జ్‌తో రోజుంతా ఛార్జింగ్

Best OnePlus Phones : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. దేశీయ మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. మీరు కూడా ఈ జనవరిలో కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. 2026లో రూ. 40వేల లోపు ధరలో కొన్ని బెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

భారీ బ్యాటరీలతో లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు మీరు కూడా కొనాలని అనుకుంటే ఈ వన్‌ప్లస్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

​వన్‌ప్లస్ నార్డ్ 5 (రూ. 36,999) :
వన్‌ప్లస్ నార్డ్ 5 లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. 50MP + 8MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 1B కలర్ ఆప్షన్లు, 144Hz రిఫ్రెష్ రేట్‌ అందించే 6.83-అంగుళాల స్విఫ్ట్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా ఈ యూనిట్ 6800mAh బ్యాటరీ కూడా ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 5 (రూ. 22,999) :
డ్యూయల్ 50MP + 8MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 6.77-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేకు సపోర్టు ఇస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Flipkart New Year Sale : ఇది కదా డిస్కౌంట్.. భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్, ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

వన్‌ప్లస్ 13ఆర్ (రూ. 39,999) :
వన్‌ప్లస్ 13ఆర్ 1B కలర్స్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ఉంది. కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ కెమెరా 50MP + 50MP + 8MP లెన్స్‌లు ఉన్నాయి.

Best OnePlus Phones (Image Credit to Original Source)

వన్‌ప్లస్ నార్డ్ 4 (రూ. 27,999) :
5500mAh బ్యాటరీ, 100W ఛార్జర్‌తో నార్డ్ 4 స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. డ్యూయల్ కెమెరా 50MP+8MP+16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.74-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.

వన్‌ప్లస్ 11 (రూ. 33,280) :
వన్‌ప్లస్ 11లో 50MP వెడల్పు, 32MP టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ ట్రిపుల్ కెమెరా ఫీచర్ ఉంది. హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్ సపోర్టు అందిస్తుంది. ఈ యూనిట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆక్సిజన్ OS 16పై రన్ అవుతుంది. 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది.